Lava Yuva Pro: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విస్తరణపై దృష్టిపెట్టిన స్మార్ట్ బ్రాండ్ లావా (Lava) నుంచి మరో కొత్త ఫోన్ రిలీజ్ అయింది. రూ.10వేల లోపు సెగ్మెంట్లో సరికొత్త 4జీ ఫోన్‌ను కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. లావా యువ ప్రో (Lava Yuva Pro) పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లో వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్‌ను అందించింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,799 వరకు ఉంది. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మెటాలిక్ గ్రే కలర్ వేరియంట్లలో లభించే ఈ కొత్త ఫోన్‌ను ప్రస్తుతానికి లావా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని కెమెరా స్పెసిఫికేషన్లు, బ్యాటరీ కెపాసిటీ, ఇతర ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
Samsung Crystal 4K TV: రూ.30 వేల లోపే సాంసంగ్ క్రిస్టల్ 4కే టీవీ... ఆఫర్ వివరాలివే
యువ ప్రో ఫోన్ ఒక లగ్జరీ డివైజ్ కాకపోవచ్చు. కానీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడగలిగే మినిమం ఫీచర్లన్నీ దీంట్లో ఉన్నాయి. లావా యువ ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD+ IPS డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది. స్క్రీన్ పైభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు మొదటి 100 రోజుల వరకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్‌కు కంపెనీ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ 3 GB RAM, 32 GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. దీంట్లో ఉన్న మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో స్టోరేజీని 512 GB వరకు పొడిగించుకోవచ్చు. ఇది మీడియాటెక్ హీలియో చిప్సెట్తో, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Dangerous Messages: వాట్సప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా? మీ అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త
* బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
లావా యువ ప్రో డివైజ్‌కు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లోని 5,000 mAh బ్యాటరీ, మంచి పవర్ బ్యాకప్‌ను అందిస్తుంది. 10W ఛార్జింగ్ అడాప్టర్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ కెపాసిటీతో అడాప్టర్ ఫోన్‌ను మూడు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయగలదు. డ్యుయల్ 4G, Wi-Fi, 3.5 mm ఆడియో జాక్, బ్లూటూత్ v5.0, OTG సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఫోన్‌ను తయారు చేశారు.
* కెమెరా కెపాసిటీ
లావా లేటెస్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 MP ప్రైమరీ సెన్సార్ ఫోటోలు, వీడియోలకు క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరా సిస్టమ్‌లో పెద్ద LED ఫ్లాష్ ఉంటుంది. దీని సాయంతో 1080p రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం ఫోన్లో 8 MP కెమెరాను అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lava, Smart phone, Technology