Flipkart Sale | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. అందుబాటు ధరలోనే సూపర్ స్మార్ట్‌ఫోన్ ఒకటి లభిస్తోంది. లావా మొబైల్స్ ఇటీవలనే మార్కెట్‌లోకి యువ 2 ప్రో పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) తీసుకువచ్చింది. బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వారు ఈ మొబైల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఈ ఫోన్ తొలి సేల్ ఈరోజు జరిగింది. అమెజాన్‌లో (Amazon) ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. లావా యువ 2 ప్రో అనేది ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ ఉంటుంది.
అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది. టైప్ సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5 ఎంపీ కెమెరా ఉంది. ఫోన్‌కు సైడ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. అంటే ఫీచర్లు బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫోన్ డిజైన్ కూడా అదిరింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ ఐఫోన్ మాదిరి కనిపిస్తోంది.
కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం రూ. 7,999 ధరతో విక్రయిస్తోంది. తొలి సేల్‌లో భాగంగా కంపెనీ డిస్కౌంట్ రేటుతో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచింది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ రేటు పైకి చేరొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ. 9,999గా ఉంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ. 600 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీకు 7,400కు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే తిరుపతి నుంచి విజయవాడ వెళ్లొచ్చు.. తక్కువ ధరలో టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 6.5 ఇంచుల స్క్రీన్ ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఈ ఫోన్ ధర రూ. 8,999గా ఉంది. అందువల్ల మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయాలన భావించే వారు అమెజాన్‌లో నేడు కొనుగోలు చేయొచ్చు. తగ్గింపు ధరలో కొంటే అదనపు బెనిఫిట్ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. లేదంటే మాత్రం జేబుకు చిల్లులు వేసుకోవాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Flipkart, Iphone, Lava, Mobile phone, Smartphone