Home /News /technology /

LAVA MOBILES LAUNCHED MADE IN INDIA SMARTPHONES LAVA Z1 Z2 Z4 AND Z6 KNOW PRICE AND SPECIFICATIONS SS

Lava Smartphones: నాలుగు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన లావా మొబైల్స్

Lava Smartphones: నాలుగు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన లావా మొబైల్స్
(image: Lava Mobiles)

Lava Smartphones: నాలుగు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన లావా మొబైల్స్ (image: Lava Mobiles)

Lava Smartphones | మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన లావా మొబైల్స్ నుంచి నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. లావా జెడ్1, లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

    ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలదే హవా అన్న సంగతి తెలిసిందే. విదేశీ బ్రాండ్స్ మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో స్మార్ట్‌ఫోన్లను అమ్ముతుంటాయి. కానీ ఇండియాకు చెందిన కంపెనీల హవా అంతంతమాత్రమే. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఉన్నా... విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో లేవు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదంటోంది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన లావా మొబైల్స్. కొత్తగా నాలుగు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసి విదేశీ కంపెనీలకు సవాల్ విసిరింది. లావా జెడ్1, లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. ఇవన్నీ రూ.10,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్సే. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా జెడ్ సిరీస్‌లో భారతీయుల ద్వారా భారతీయులకు నాలుగు స్మార్ట్‌ఫోన్లు పరిచయం చేస్తున్నట్టు లావా ప్రకటించింది. దీంతో పాటు 'My Z', 'Z Up' పేరుతో రెండు ప్రోగ్రామ్స్ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా కస్టమర్లు తమకు నచ్చినట్టుపో స్మార్ట్‌ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి ఏ ప్రాసెసర్ కావాలో, కెమెరా ఎంత ఉండాలో వాళ్లే నిర్ణయించుకోవచ్చు. లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 స్మార్ట్‌ఫోన్లు జనవరి 11 నుంచి, లావా జెడ్1 జనవరి 26 నుంచి అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.


    లావా జెడ్1 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 5 అంగుళాలు
    ర్యామ్: 2జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ20
    రియర్ కెమెరా: 5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 3,100ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    ధర: రూ.5,499


    లావా జెడ్2 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 2జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    ధర: రూ.6,999


    లావా జెడ్4 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమసీ కెమెరా + 2 మెగాపిక్సెల్ ఏఐ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    ధర: రూ.8,999


    లావా జెడ్6 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమసీ కెమెరా + 2 మెగాపిక్సెల్ ఏఐ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    ధర: రూ.9,999
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Lava Mobiles, Mobile, Mobile News, Smartphone, Smartphones

    తదుపరి వార్తలు