హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Lava X2: రూ.7,000 లోపే లావా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Lava X2: రూ.7,000 లోపే లావా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Lava X2: రూ.7,000 లోపే లావా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Amazon India)

Lava X2: రూ.7,000 లోపే లావా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Amazon India)

Lava X2 | మీరు రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? లావా మొబైల్స్ (Lava Mobiles) రూ.7,000 లోపే స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మొబైల్స్ (Lava Mobiles) తన మొట్టమొదటి ఎక్స్ -సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. లావా ఎక్స్2 (Lava X2) పేరుతో దీన్ని భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ మొబైల్ బడ్జెట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ ద్వారా లావా తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని యోచిస్తోంది. లావా ఎక్స్​ 2 బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ 6.5 -అంగుళాల HD+ IPS డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 2 జీబీ ర్యామ్​ గల సింగిల్​ వేరియంట్​లోనే అందుబాటులో ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. దీనిలో 5,000mAh బ్యాటరీని అమర్చింది. దీని ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

లావా ఎక్స్​ 2 ధర


లావా X2 స్మార్ట్​ఫోన్​ 2 జీబీ ర్యామ్​/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల సింగిల్​ వేరియంట్​లోనే లభిస్తుంది. ఈ వేరియంట్​ రూ.6,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్ ప్రీఆర్డర్లు అమెజాన్​లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రీ-ఆర్డర్లు మార్చి 11 వరకు కొనసాగుతాయి. అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ రూ.6,599 ధర వద్ద అందుబాటులో ఉంది. లావా ఎక్స్​2 మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. బ్లూ, సియాన్ అనే రెండు కలర్​ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్, లావా ఈ–స్టోర్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Google Account: మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

లావా ఎక్స్​2 స్పెసిఫికేషన్లు


లావా ఎక్స్​ 2 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. దీనిలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో కూడిన 6.5 -అంగుళాల HD+ IPS డిస్‌ప్లేను అమర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆక్టా-కోర్ మీడియాటెక్​ హీలియో SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఇది 2 జీబీ ర్యామ్​, 32GB ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. అయితే, ఏ ఆండ్రాయిడ్ వెర్షన్​పై డివైజ్ రన్ అవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. దీనిలో 5,000mAh భారీ బ్యాటరీని అమర్చింది.

Smartphone Offer: రూ.25,990 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.10,000 లోపే

ఇక, భద్రత కోసం, స్మార్ట్​ఫోన్​ వెనుక భాగంలో ఫింగర్​ప్రింట్​ స్కానర్, ఫేసియల్​ రికగ్నిషన్​ వంటివి అందించింది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. వైఫై, బ్లూటూత్ v5.0, 3.5 mm ఆడియో జాక్, యూఎస్​బీ టైప్- సీ ఛార్జింగ్ పోర్ట్, ఓటీజీ సపోర్ట్ వంటివి అందించింది. కెమెరా విషయానికి వస్తే.. స్మార్ట్​ఫోన్​ వెనుక భాగంలోని డ్యూయల్ కెమెరా సెటప్‌లో 8 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను చేర్చింది. ఇక, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం 5 -మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను అందించింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Lava, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు