Home /News /technology /

Lava Agni 5G: మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన లావా మొబైల్స్

Lava Agni 5G: మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన లావా మొబైల్స్

2. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో (Download Twitter Video)’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయండి. తరువాత ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ ట్వీట్ నుంచి వీడియో లేదా గిఫ్ (gif) ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్వీట్‌ లింక్ కాపీ చేయండి.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

2. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో (Download Twitter Video)’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయండి. తరువాత ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ ట్వీట్ నుంచి వీడియో లేదా గిఫ్ (gif) ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్వీట్‌ లింక్ కాపీ చేయండి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Lava Agni 5G | 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (5G Smartphone) రిలీజ్ చేసింది లావా మొబైల్స్, లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకోండి.

    ఇండియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఇండియాలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలనుకునేవారికి లావా అగ్ని 5జీ (Lava Agni 5G) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో నవంబర్ 18 నుంచి కొనొచ్చు. అమెజాన్‌లో, లావా ఇ-స్టోర్‌లో ప్రీ-బుకింగ్ మొదలైంది. రూ.500 చెల్లించి ప్రీ-బుకింగ్ చేయొచ్చు. ప్రీ-బుకింగ్ చేసేవారికి రూ.2,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ప్రీ-బుక్ చేసేవారు కేవలం రూ.17,999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    Bluetooth: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాక్... బ్లూటూత్ ఆన్ చేస్తే అంతే సంగతులు

    5జీ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్


    ఇండియాలో 5జీ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైనాకు చెందిన షావోమీ, రియల్‌మీ లాంటి బ్రాండ్స్ ఇండియాలో పలు 5జీ మొబైల్స్ రిలీజ్ చేశాయి. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా 5జీ మొబైల్ రావడం విశేషం. రూ.20,000 బడ్జెట్‌లో రియల్‌మీ 8ఎస్ 5జీ, ఐకూ జెడ్3, సాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీ, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ లాంటి మోడల్స్ ఉన్నాయి.


    స్పెసిఫికేషన్స్ ఇవే...


    లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ 5జీ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ 11 యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు.

    Flipkart: ఫ్లిప్‌కార్ట్ కొత్త ప్రోగ్రామ్... రెండు వారాల తరువాత స్మార్ట్‌ఫోన్లు రిటర్న్ చేసే ఆప్షన్

    లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో అల్‌ట్రా హెచ్‌డీ మోడ్, సూపర్ నైట్ షాట్, గిఫ్ మోడ్, మ్యాక్రో మోడ్, ఏఐ మోడ్, బ్యూటీ మోడ్, ప్రో మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్, టైమ్ ల్యాప్స్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Lava, Mobile News, Mobiles, Smartphone

    తదుపరి వార్తలు