Home /News /technology /

LAVA BLAZE LAUNCHED INDIA PRICE AND SPECIFICATIONS CHECK HERE AND KNOW FULL DETAISLS HERE VB

Lava Blaze Smartphone: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్..

Lava Blaze Smartphone: బడ్జెట్ ధరలో  కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్..

Lava Blaze Smartphone: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్..

Lava Blaze Smartphone: దేశీ మొబైల్ సంస్థ అయిన లావా బ్లేజ్(Lava Blaze) ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించింది. ఇది కేవలం రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి అందుబాటులో ఉండనుంది.

Lava Blaze Smartphone: దేశీ మొబైల్ సంస్థ అయిన లావా బ్లేజ్(Lava Blaze) ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను(Smartphone) ప్రారంభించింది. ఇది కేవలం రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి అందుబాటులో ఉండనుంది. ఈ లావా స్మార్ట్‌ఫోన్(Smartphone) వెనుక గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. అంతే కాకుండా దీనికి ట్రిపుల్ కెమెరా(Trippel Camera) సెటప్‌ కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.9699. ఇక లాంచింగ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించారు. అంటే రాయితీ పోను ఈ మొబైల్ అనేది రూ. 8,699కే కొనుగోలు చేయవచ్చు. సిటీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లను(Credit Cards) కలిగి ఉన్న కస్టమర్లకు మరో 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

WhatsApp Scam: వాట్సప్‌లో కొత్త మోసాలు.. ఈ మెసేజ్‌లు వస్తున్నాయా? ఐతే జాగ్రత్త

ఈ ఫోన్ నాలుగు కలర్లలో అందుబాటులో ఉంది. అవి గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ అండ్ గ్లాస్ రెడ్. లావా ఇండియా వెబ్‌సైట్,రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రస్తుతం ప్రీబుకింగ్(Pre Orders) అందుబాటులో ఉంది. ప్రీ బుకింగ్ చేసుకునే మొదటి 500 మంది లావా ఇయర్ బడ్స్(Earbuds) ఉచితంగా పొందవచ్చు. 100 రోజుల వరకు ఈ స్మార్ట్ ఫోన్‌కి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.



స్పెసిఫికేషన్స్ ఇలా..
లావా బ్లేజ్ 1600 x 720 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. ఫోన్ ముందు కెమెరా కోసం ఎగువన వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. చిప్‌సెట్ ఎంట్రీ-లెవల్ SoC, ఇది చాలా పాతది. ఇది 3GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 256GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది.

ఇందులో 13MP ప్రధాన కెమెరా సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ అండ్ VGA సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ లోపల 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌తో రన్ అవుతుంది. ఇది 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి USB టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో కూడా వస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, 5G Smartphone, Mobile phones, Smart phone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు