భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా తన మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.
భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) తన మొట్ట మొదటి 5జీ స్మార్ట్ ఫోన్‌ను (Smart Phone) లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు లావా అగ్ని 5జీ (5G) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కంపెనీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా దీని లాంచింగ్‌ను ధ్రువీకరించింది. అయితే లాంచింగ్‌కు ముందే దీనికి సంబంధించిన ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. లీకేజీని బట్టి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. లావా అగ్ని 5జి స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో (Battery) వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 19,999 ధర వద్ద లభించనుంది. ఇది భారతదేశంలో ఇప్పటికే ఉన్న రెడ్మీ (Red Mi), రియల్మీ (Ream Me), శామ్సంగ్ (Samsung) 5జీ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ.15 వేలలోపు అందుబాటులో ఉండగా, రియల్మీ 8 5జీ రూ. 16 వేల ధరలో లభిస్తుంది. ఇక, శామ్సంగ్ 5జీ స్మార్ట్ఫోన్లు రూ. 20 వేల ప్రారంభ ధర వద్ద లభిస్తున్నాయి.
లావా అగ్ని 5జీ స్పెసిఫికేషన్లు
లావా అగ్ని 5జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ "గేమింగ్ మోడ్"తో వస్తుంది. దీని వెనుక భాగంలో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 64- మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఎల్ఈడీ ఫ్లాష్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. లావా అగ్ని మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్‌ను అందించింది. అయితే ఈ డివైజ్ ఒకే ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుందా? లేక విభిన్న ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు. లావా అగ్ని యూఎస్బీ టైప్- సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఇరువైపులా స్పీకర్ గ్రిల్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో రానుంది. ఈ ఫోన్ సింగిల్ బ్లూ కలర్ ఆప్షన్లోనే లభిస్తుంది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.