షియోమి కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. షియోమి సివి 1ఎస్ (Xiaomi Civi 1S) పేరుతో కొత్త మోడల్‌ను కంపెనీ గురువారం చైనాలో లాంచ్ చేసింది.
షియోమి కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్(Smartphone Release) అయింది. షియోమి సివి 1ఎస్ (Xiaomi Civi 1S) పేరుతో కొత్త మోడల్‌ను కంపెనీ గురువారం చైనాలో లాంచ్ చేసింది. 2021 సెప్టెంబర్‌లో విడుదల చేసిన చైనా స్పెసిఫిక్ Civi సిరీస్‌కు(Series) కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ లాంచ్ అయింది. సెల్ఫీని ఇష్టపడే వినియోగదారులను ఆకట్టుకొనేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇది 2x జూమ్, ఆటో ఫోకస్(Auto Focus) వంటి ఫీచర్లతో వస్తుంది. 32 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(Camera) ఉంది. 4D లైట్ చేంజింగ్ బ్యూటీ, నేటివ్ బ్యూటీ పోర్ట్రెయిట్ 2.0 టెక్నాలజీల వంటి అనేక బ్యూటిఫికేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. హ్యాండ్సెట్ 'మిరాకిల్ సన్‌షైన్' డిజైన్‌తో గ్రేడియంట్ డైమండ్ టెక్చర్డ్ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటోంది.
* ధర, లభ్యత
Xiaomi Civi 1S ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం లేదు. బేస్ 8GB RAM+ 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్ ధర 2,299 CNY(దాదాపు రూ.27,100). ఇందులో 8GB RAM+ 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ మోడల్ ఉంది. దీని ధర 2,599 CNY (దాదాపు రూ.30,700). ఈ స్మార్ట్‌ఫోన్‌లో టాప్ ఎండ్ 12GBRAM+ 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ధర 2,899 CNY (దాదాపు రూ.34,200). ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, పింక్, వైట్ కలర్ ఆప్షన్స్‌లో వచ్చే అవకాశం ఉంది.
* స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Xiaomi Civi 1S హ్యాండ్సెట్ 6.55 అంగుళాల మైక్రో-కర్వ్డ్ ఫుల్ HD+ OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 950 nits బ్రైట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. స్నాప్‌డ్రాగన్ 778G+ SoC చిప్సెట్తో పనిచేస్తుంది. గత సంవత్సరం లాంచ్ అయిన Xiaomi Civi కంటే 27 శాతం మెరుగ్గా పనితీరును కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం.. ఈ హ్యాండ్సెట్ సగటు ఫ్రేమ్ రేట్ 87.7 fpsతో 3 గంటలపాటు గేమ్స్ ఆడేందుకు సపోర్ట్ చేస్తుంది. సాధారణ అవసరాల వినియోగానికి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హోల్-పంచ్ కెమెరా ఉంది. f/1.79 అపర్చర్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ద్వారా హైలైట్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది f/2.2 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు f/2.4 అపర్చర్ కలిగిన 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ 55W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ MIUI 13 ఇంటర్ఫేస్ను పోలి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12పై పని చేస్తుంది. Civi 1S డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో నడిచే డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్సెట్ మల్టీఫంక్షనల్ NFC, బ్లూటూత్ v5.2, IR రిమోట్ కంట్రోల్ టెక్నాలజీలను అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.