LAUNCH OF TWO SMARTPHONES IN THE TECHNO CAYMAN 17 SERIES FEATURES THAT ARE AFFORDABLE AT A BUDGET PRICE VB GH
New Smart Phones: తక్కువ బడ్జెట్ లో రెండు స్మార్ట్ఫోన్లు లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు.. వివరాలు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
New Smart Phones: హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా మరో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. టెక్నో కేమన్ 17, టెక్నో కామన్ 17 ప్రో పేర్లతో వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలో అధునాతన ఫీచర్లను జోడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా మరో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. టెక్నో కేమన్ 17, టెక్నో కామన్ 17 ప్రో పేర్లతో వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లలో అధునాతన ఫీచర్లను జోడించింది. కొత్త టెక్నో కేమన్ 17 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్లోనే లభిస్తుంది. ఇది రూ.16,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇక, టెక్నో కామన్ 17 మాత్రం 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. ఇది రూ.12,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం ఫ్రాస్ట్ సిల్వర్, స్ప్రూస్ గ్రీన్, మాగ్నెట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ రెండు ఫోన్లను జూలై 26 నుంచి కొనుగోలు చేయవచ్చు. కాగా, ప్రారంభపు ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,999 డిస్కౌంట్ అందించింది. ఇక, హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై మరో 10 శాతం ఇన్స్టన్ట్ డిస్కౌంట్ పొందవచ్చు.
టెక్నో కేమన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు
టెక్నో కామన్ 17 ప్రో ఆండ్రాయిడ్ 11 ఆధారిత హయోస్ వి 7.6 పై పనిచేస్తుంది. ఇది 6.8 -అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపిఎస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్‌తో జత చేసిన మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్డి కార్డ్ సహాయంతో దీన్ని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే, టెక్నో కేమన్ 17 ప్రోలో క్వాడ్ కెమెరా సెటప్‌ను చేర్చింది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరా, అదనంగా రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను చేర్చింది. ఇక, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 48 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించింది. టెక్నో డ్యూయల్ ఫ్లాష్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇక, ఈ స్మార్ట్‌ఫోన్ 4G LTE, వైఫై, బ్లూటూత్ v5, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది టెక్నో కామన్ 17 ప్రో ఆండ్రాయిడ్ 11 ఆధారిత హయోస్ వి 7.6 పై పనిచేస్తుంది.
ఇది 6.8- అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఐపిఎస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హెలియో G85 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో SD కార్డ్ ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక, కెమెరాల విషయానికి వస్తే, టెక్నో కామోన్ 17లో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, మూడు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను చేర్చింది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.