చైనీస్ స్మార్ట్‌ఫోన్(Smartphone) బ్రాండ్ వివో(Brand Vivo) నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు(Smartphones) రిలీజ్(Release) అయ్యాయి. కంపెనీ కొత్తగా వివో ఎక్స్ 80 (Vivo X 80) సిరీస్‌ను ఈ వారం చైనాలో(China) లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో తాజాగా వివో ఎక్స్ 80 (Vivo X80), వివో ఎక్స్ 80 ప్రో (Vivo X80 Pro) పేరుతో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లను(Smartphone) కంపెనీ(Company) లాంచ్ చేసింది. మంచి పర్ఫార్మెన్స్‌కు భరోసా ఇచ్చే ఈ టాప్ వేరియంట్స్ లేటెస్ట్ కెమెరా టెక్నాలజీతో(Technology) వస్తాయని వివో తెలిపింది. వివో X80, వివో X80 Pro స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్(Media Tech), క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లతో(Chipset) పనిచేస్తాయి. ఇవి AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. వీటి కెమెరాలు Zeiss టెక్నాలజీతో వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్(Fast Charging Feature) కూడా కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో X80 సిరీస్.. కంపెనీ నుంచి వచ్చిన X70 లైనప్‌కు సక్సెసర్ సిరీస్. వివో X80 సిరీస్ ఫోన్లు రానున్న రోజుల్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
* ధరలు
వివో X80 స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB మోడల్ ధర CNY 3,699 (సుమారు రూ. 42,300). 8GB + 256GB వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ.46,700), 12GB + 256GB వేరియంట్ ధర CNY 4,399 (సుమారు రూ.51,400), 12GB + 512GB వేరియంట్ ధర CNY 4,899 (సుమారు 57,200)గా ఉంది. వివో X80 ప్రో బేస్ 8GB + 256GB మోడల్ ధర CNY 5,499 నుంచి ప్రారంభమవుతాయి. 12GB + 512GB వేరియంట్ ధర CNY 6,699 వరకు ఉంటుంది.
* వివో X80 స్పెసిఫికేషన్లు
వివో X80 స్మార్ట్‌ఫోన్ ధర తక్కువ కాబట్టి, దీని ఫీచర్లు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో, 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుంది. దీని కెమెరాలు సాధారణంగా ఉన్నాయి. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. వివో X80 ఫోన్ 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కానీ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు.
* వివో X80 ప్రో స్పెసిఫికేషన్లు
ఇది ఒక ఫ్లాగ్‌షిప్ ఫోన్. 6.78-అంగుళాల LTPO2 AMOLED డిస్‌ప్లే, QHD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వంటివి దీని ప్రత్యేకతలు. దీని స్క్రీన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌లతో పనిచేస్తుంది. ఈ మోడల్ గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. వివో X80 ప్రో ఫోన్ Zeiss టెక్నాలజీ బేస్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది. ఈ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్.. OIS, 2x జూమ్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. వివో X80 ప్రో ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్, కూలింగ్ సిస్టమ్ వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Smartphone, Vivo