Home /News /technology /

LAUNCH OF TWO MORE HONOR LAPTOPS IN INDIA MAGIC BOOK X14 MAGIC BOOK X15 LAPS PRICE FEATURES DETAILS HERE GH VB

Honor Laptops: ఇండియాలో మరో రెండు హానర్ లాప్‌టాప్‌లు లాంచ్.. వాటి ధర, ఫీచర్లు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మొబైల్‌ ఫోన్స్‌ తయారీ సంస్థ హానర్‌(Honor).. ఇటీవల మ్యాజిక్‌ బుక్‌ పేరుతో ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. కొత్తగా ల్యాప్‌టాప్‌ల మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు వినియోగదారుల ఆదరణ లభించింది.

ప్రముఖ మొబైల్‌ ఫోన్స్‌ (Mobile Phones) తయారీ సంస్థ హానర్‌(Honor).. ఇటీవల మ్యాజిక్‌ బుక్‌ (Magic Book) పేరుతో ల్యాప్‌టాప్‌లను(Laptops) లాంచ్‌ చేసింది. కొత్తగా ల్యాప్‌టాప్‌ల మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు వినియోగదారుల ఆదరణ లభించింది. తాజాగా మ్యాజిక్‌ బుక్‌ సిరీస్‌లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. స్లిమ్ డిజైన్(Slim Design), విండోస్‌ లేటస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(Operating System), ఐ కంఫర్ట్‌ మోడ్‌, అతి తక్కువ బరువు, యాంటి గ్లేర్‌ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి అధునాత ఫీచర్లతో(New Features) వస్తున్న ల్యాప్‌టాప్‌లు వినియోగదారులను ఆకట్టుకొంటాయని హానర్‌ కంపెనీ చెబుతోంది.

ఇండియన్‌ మార్కెట్‌(Indian Market)లోకి హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ ఎక్స్‌(Honor MagicBook X) ల్యాప్‌టాప్ సిరీస్‌ లాంచ్‌ అయ్యాయి. హానర్‌ కంపెనీ ఈ ప్రొడక్ట్స్‌ ధర, స్పెసిఫికేషన్‌లు ప్రకటించింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన Honor MagicBook X14, MagicBook X15 ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ కోర్ i3, కోర్ i5 ప్రాసెసర్‌లతో పని చేస్తాయి. 8GB RAM, 512GB వరకు SSD స్టోరేజ్ ఉన్నాయి. ఈ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లు విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌(Windows 11 Operating System) ఆధారంగా పని చేస్తున్నాయి. పాప్-అప్ ఫ్రంట్ కెమెరా, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అనేక ఇతర ఆసక్తికరమైన ఫీచర్‌లు ఉన్నాయి.

Acer Laptop: ఇండియాలో లాంచ్ అయిన ఏసర్ నిట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌... ఫీచర్లు, ధర వివరాలిలా..


ఇండియాలో ల్యాప్‌టాప్‌ల ధరలు
అమెజాన్‌ ద్వారా హానర్‌ మ్యాజిక్‌బుక్‌ ఎక్స్‌ 14, మ్యాజిక్‌ బుక్‌ ఎక్స్‌ 15 ల్యాప్‌టాప్‌లను విక్రయించనున్నారు. హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్‌ 14, ఎక్స్‌ 15 ధరలు రూ.36,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది ప్రారంభం సందర్భంగా అందిస్తున్న ఆఫర్‌ అని.. కొంత సమయం తర్వాత దీని ధర రూ.40,990గా ఉండవచ్చని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్‌ 14, మ్యాజిక్‌బుక్ ఎక్స్‌ 15 ల్యాప్‌టాప్‌లు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఇండియాలో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.

ViewSonic: హోమ్‌, ఆఫీస్‌ల కోసం వ్యూసోనిక్‌ బడ్జెట్‌ మానిటర్లు.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!


స్పెసిఫికేషన్‌లు..
ఈ ల్యాప్‌టాప్‌లు ఫుల్ హెచ్‌డీ యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. వాటి పేర్ల ప్రకారం ఎక్స్‌ 14 ల్యాప్‌టాప్‌కు 14 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. అదే విధంగా ఎఎక్స్‌ 15 ల్యాప్‌టాప్‌కు 15 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు. ఐ కంఫర్ట్ మోడ్‌ను హానర్ అందించింది. ఇది ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌ను వినియోగించేలా.. కళ్లకు ఎలాంటి ఇబ్బంది, అలసట కలగకుండా సహాయపడుతుంది.
మ్యాజిక్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌ బాడీ ప్రీమియం అల్యూమినియం మెటల్‌తో తయారు చేశారు. ఇది అందంగా కనిపించడమే కాకుండా తక్కువ బరువు ఉంటుంది. హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్‌ 14, మ్యాజిక్‌బుక్ ఎక్స్‌ 15 ల్యాప్‌టాప్‌లు కేవలం 1.38 కిలోలు మాత్రమే ఉంటాయి. ఇది మరింత రియలిస్టిక్‌ వ్యూ అనుభూతిని కలిగిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Honor, Laptops, Price, Windows 11

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు