Home /News /technology /

LAUNCH OF REDMI NOTE PHONES FROM XIAOMI LET THE DETAILS OF THE PRICE AND FEATURES OF THESE TWO DEVICES GH VB

Xiaomi: షియోమి నుంచి రెడ్‌మీ నోట్ ఫోన్లు లాంచ్.. ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్ల వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షియోమి (Xiaomi) సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ నుంచి నోట్ 11T ప్రో (Redmi Note 11T Pro), నోట్ 11T ప్రో ప్లస్ (Note 11T Pro+) డివైజ్‌లను కంపెనీ చైనాలో ఆవిష్కరించింది.

షియోమి (Xiaomi) సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ నుంచి నోట్ 11T ప్రో (Redmi Note 11T Pro), నోట్ 11T ప్రో ప్లస్ (Note 11T Pro+) డివైజ్‌లను కంపెనీ చైనాలో ఆవిష్కరించింది. 6.6 అంగుళాల వేరియబుల్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌లు, 64MP మెయిన్ క్యామ్‌లతో అదే కోర్ స్పెక్స్, డిజైన్‌తో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ప్రో ప్లస్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,400 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 512GB వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. వీటితో పాటు నోట్ 11SE మోడల్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రానున్న మిడ్‌రేంజ్ డివైజ్.

Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌.. తెలుసుకోండి.. ట్రై చేయండి

* Redmi Note 11T Pro/Pro+
ఈ రెండు ఫోన్‌ల మధ్య ప్రధాన తేడా బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే. 11T ప్రో ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పెద్ద 5,080 mAh డ్యుయల్ సెల్ బ్యాటరీతో వస్తుంది. అయితే ప్రో ప్లస్ వేరియంట్ 4,400 mAh డ్యుయల్ సెల్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. షియోమి ప్రో ప్లస్ ఫోన్ 19 నిమిషాలలో 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇది ఛార్జింగ్ టెంపరేచన్‌ను పర్యవేక్షించే షియోమి సర్జ్ P1 చిప్‌తో వస్తుంది.

11T ప్రో ఫోన్‌లు రెండూ ఫ్లాట్ 6.6-అంగుళాల IPS LCD ప్యానెల్‌ FHD+ రిజల్యూషన్ (2460x1080px)తో వస్తాయి. వేరియబుల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు బ్యాటరీ ఆదా చేయడానికి 30Hz వరకు దీన్ని తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది. పంచ్ హోల్ కటౌట్‌లో 16MP సెల్ఫీ క్యామ్ ఉంది. రియర్ కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో క్యామ్‌తో పాటు 64MP శామ్‌సంగ్ ISOCELL GW1 సెన్సార్ (1/1.72" పరిమాణం మరియు 1.6μ, పిక్సెల్‌లు) ఉన్నాయి. రెండు నోట్ 11T ప్రో ఫోన్‌లు 8GB LPDDR5 RAM, 256/512GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ MIUI 13 ఓఎస్‌తో రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లు IP53 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌లతో వస్తాయి.

రెడ్‌మీ నోట్ 11T ప్రో, ప్రో ప్లస్ ఫోన్లు అటామిక్ సిల్వర్, టైమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో వస్తాయి. నోట్ 11T ప్రో బేస్ వేరియంట్ 6/128GB ధర CNY 1,799 ($270) నుంచి ప్రారంభమవుతుంది. 8/256GB మోడల్ ధర CNY 2,199 ($330) వరకు ఉంటుంది. నోట్ 11T ప్రో ప్లస్ బేస్ 8/128GB వేరియంట్ CNY 2,099 ($315) వద్ద లభిస్తుంది. అయితే దీని 8/512GB మోడల్ టాప్ వేరియంట్ ధర CNY 2,499 ($375)వరకు ఉంటుంది. 8/512GB ఆస్ట్రో బాయ్ ఎడిషన్ CNY 2,499 ($375)కి అందుబాటులో ఉంటుంది. చైనాలో ఈ ఫోన్ల ఓపెన్ సేల్స్ మే 31 నుంచి ప్రారంభమవుతాయి. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లో వీటి లాంచింగ్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Published by:Veera Babu
First published:

Tags: Redmi, Smartphones, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు