మార్కెట్​లోకి Realme X7 Pro Ultra స్మార్ట్ ఫోన్ మోడల్​ లాంఛ్​.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

ప్రతీకాత్మకచిత్రం

రియల్​మీ తన ఎక్స్ 7 సిరీస్​లో ఎక్స్​ 7 ప్రో మోడల్​ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్​లో ఎక్స్​7ప్రో అల్ట్రా అనే కొత్త మోడల్​ను​ లాంఛ్ చేయడానికి సద్ధమవుతోంది. ఈ స్మార్ట్​ఫోన్​లో అట్రాక్టివ్​ ఫీచర్లను అందించింది.

  • Share this:
ప్రముఖ మొబైల్​​ తయారీ సంస్థ రియల్‌మీ వరుస స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ.. భారత మార్కెట్​లో పాపులర్​ బ్రాండ్​గా రాణిస్తోంది. తాజాగా, రియల్​మీ తన ఎక్స్ 7 సిరీస్​లో ఎక్స్​ 7 ప్రో మోడల్​ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్​లో ఎక్స్​7ప్రో అల్ట్రా అనే కొత్త మోడల్​ను​ లాంఛ్ చేయడానికి సద్ధమవుతోంది. ఈ స్మార్ట్​ఫోన్​లో అట్రాక్టివ్​ ఫీచర్లను అందించింది. ఇది అల్ట్రా బ్లాక్, స్కై బ్లూ అనే మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో అమ్ముడవుతున్న రియల్​మీ 7 ప్రో అల్ట్రా 8GB + 128GB వేరియంట్​ 2,299 యువాన్ (US $ 350 / భారత కరెన్సీలో రూ. 25,695)లకు లభిస్తుండగా, 12GB + 256GB వేరియంట్​ 2,599 యువాన్ (US $ 395 / భారత కరెన్సీలో రూ .29,050) ధరకు అందుబాటులో ఉంది. కాగా, దీనిలో అందించిన అట్రాక్టివ్​ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

రియల్మే X7 ప్రో అల్ట్రా స్పెసిఫికేషన్లు
1. రియల్​ మీ ఎక్స్​ 7 ప్రో అల్ట్రా 6.55 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ 90Hz అమోలేడ్ కర్వ్డ్ డిస్​ప్లేతో వస్తుంది. దీనిలో1200 నిట్స్ బ్రైట్​నెస్​, 100% DCI–P3 వైడ్ కలర్ గ్యాముట్​, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​ వంటి వాటిని అందించింది.
2. ఈ స్మార్ట్​ఫోన్​ ఆక్టా-కోర్ మాలి-జి 77 MC9 GPU డైమెన్సిటీ 1000+ 7nm ప్రాసెసర్​తో పనిచేస్తుంది.
3. దీనిలో 128GB ర్యామ్​, 256GB స్టోరేజ్​ను అందించింది.
4. రియల్​మీ UI 2.0 తో కూడిన ఆండ్రాయిడ్​ 11 ఆపరేటింగ్​ సిస్టమ్​తో పనిచేస్తుంది.
5. దీనిలో డ్యుయల్​ సిమ్ (నానో + నానో)ను అందించింది.
6. 64 ఎంపీ రియర్​ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2 ఎంపీ రెట్రో పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరాలను చేర్చింది. వీటితో పాటు సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించింది.
7. ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​ను కూడా చేర్చింది.
8. సూపర్ లీనియర్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆడియో, హై-రెస్ ఆడియోలను అందించింది.
9. కనెక్టివిటీ పరంగా చూస్తే.. దీనిలో 5 జీఎస్‌ఐ/ ఎన్‌ఎస్‌ఏ, డ్యూయల్ 4 జి వోల్‌టిఈ, వై-ఫై 6 802.11, బ్లూటూత్ 5, జిపిఎస్ / గ్లోనాస్ / బీడౌ, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్–-సిలను అందించింది.

10. బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 65W అల్ట్రా-ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్​తో 4500mAh బ్యాటరీని అందించింది. ఇది కేవలం 35 నిమిషాల్లో 100% ఛార్జ్‌ను అందిస్తుంది.
Published by:Krishna Adithya
First published: