LAUNCH OF REALME CONVERTIBLE ACS WITH A STARTING PRICE OF RS 27999 PRODUCTS THAT COME WITH POWER SAVING AND AUTO CLEANING FEATURES GH VB
Realme ACs: ‘రియల్ మీ’ కేవలం మొబైల్స్ కే పరిమితం కాదండోయ్.. ఏసీలు కూడా వచ్చేశాయ్.. అందుబాటు ధరలో..
ప్రతీకాత్మక చిత్రం
రియల్మీ టెక్లైఫ్ ఎకోసిస్టమ్(Realme TechLife Echo Systems)ను భారతదేశపు ఉపకరణాల విభాగానికి Realme విస్తరించింది. ఇండియన్ మార్కెట్లోకి కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్లను (ACs) కంపెనీ విడుదల చేసింది.
రియల్మీ టెక్లైఫ్ ఎకోసిస్టమ్(Realme TechLife Echo Systems)ను భారతదేశపు ఉపకరణాల విభాగానికి Realme విస్తరించింది. ఇండియన్ మార్కెట్లోకి కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్లను (ACs) కంపెనీ విడుదల చేసింది. స్ప్లిట్ లేదా కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్లను మూడు మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని ఏసీ మోడల్స్ తెలుపు రంగులో వస్తాయి. ఇటీవల Realme భారతదేశంలో కొత్త సిరీస్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే..
భారతదేశంలో Realme కన్వర్టబుల్ ఏసీ ధర, లభ్యత
Realme కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్ల కొత్త శ్రేణి 1 టన్ను, 1.5 టన్ను సామర్థ్యాలలో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1 టన్ను సామర్థ్యం ఉన్న మోడల్ ధర రూ.27,790 కాగా, ఫోర్ స్టార్ రేటింగ్‌తో 1.5 టన్ను మోడల్ ధర రూ.30,999గా ఉంది. ఫైవ్ స్టార్ 1.5 టన్ను మోడల్ రూ.33,490కి అందుబాటులో ఉంది.
* Realme కన్వర్టబుల్ ఏసీ ఫీచర్లు
కన్వర్టబుల్ ఎయిర్ కండీషనర్లను రియల్మీ ప్రత్యేకంగా భారతదేశంలో వేసవి కాలం వినియోగానికి అనుకూలంగా రూపొందించింది. ఈ ఎయిర్ కండీషనర్లు 55 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద కూడా గదిని చల్లబరుస్తాయి. రియల్మీ ఎయిర్ కండీషనర్లు మూడు కూలింగ్ మోడ్లతో అందుబాటులో ఉన్నాయి. డ్రై, స్లీప్, ఎకో వేరియంట్లలో లభిస్తున్నాయి. గదిలోని వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఎయిర్ కండీషనర్ కూలింగ్ కెపాసిటీని మార్చగలదు. గదిలో సరైన ఉష్ణోగ్రతను నిర్ధారిస్తుంది. 4-ఇన్-1 శీతలీకరణ సామర్థ్యాన్ని 40 శాతం, 60 శాతం, 80 శాతం, 110 శాతం మధ్య మార్చవచ్చు. ఈ ఎయిర్ కండీషన్లకు వేగవంతమైన, కచ్చితమైన, సమర్థవంతమైన కూలింగ్ యాక్టివిటీస్ అందించడంలో సహాయపడే ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ కూడా ఉంది. ఆటో రీస్టార్ట్ సదుపాయం ఉంది. దీనిద్వారా వినియోగదారులు పవర్ కట్ తర్వాత సెట్టింగ్స్‌ను మాన్యువల్‌గా రీసెట్ చేయనవసరం లేదు.
ఎయిర్ కండీషనర్ల స్పోర్ట్ ఆటో క్లీన్ ఫీచర్ ద్వారా తేమ, దుమ్ము నుంచి యూనిట్‌కు రక్షణ లభిస్తుంది. ఎయిర్ కండీషన్‌ను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత.. ఆటో క్లీన్ ఫీచర్ 30 సెకన్ల పాటు పని చేస్తుంది. బలమైన గాలి విసరడం ద్వారా నీటి బిందువులను పొడిగా చేస్తుంది. సమర్థవంతమైన ఉష్ణ బదిలీని సులభతరం చేయడానికి 100 శాతం కాపర్ కండెన్సర్, ఇన్నర్ గ్రూవ్డ్ కాపర్ ట్యూబ్‌లతో పాటు, కాయిల్స్‌కు సమర్థవంతమైన రక్షణ కోసం బ్లూ ఫిన్ టెక్నాలజీ సదుపాయం కూడా ఎయిర్ కండీషనర్లలో ఉంది. నిశ్శబ్దంగా పని చేసేందుకు వీలుగా ఎయిర్ కండీషనర్ పర్యావరణ అనుకూల రిఫ్రిజెరాంట్తో వస్తుంది. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్‌కు మద్దతు ఇస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.