ప్రముఖ స్మార్ట్‌ఫోన్(Smart Phone) తయారీ సంస్థ ఐక్యూ తన జెడ్ సిరీస్(Series) నుంచి ఐక్యూ Z6 5G ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. జెడ్ సిరీస్‌లో ఇది అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్(Smart Phone). దీనిలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 20 వేల ధరలోనే లభిస్తున్న పోకో M4 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ F23, రియల్మీ 9 5G ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది. కాబట్టి, ధర, కెమెరా, డిస్ప్లే(Display), ప్రాసెసర్(Processor), బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి వివిధ పారామీటర్లతో ఐక్యూ జెడ్ 6ను పోల్చి చూద్దాం.
ధర
ఐక్యూ Z6 5G ఫోన్ 4 GB RAM వేరియంట్ రూ. 15,999 ధర వద్ద లభిస్తుంది. ఇక, 6 GB RAM వేరియంట్ రూ. 16,999 వద్ద, 8 GB RAM కలిగిన టాప్ వేరియంట్ రూ. 17,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. మరోవైపు, పోకో M4 ప్రో 6 GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీని 6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,499 వద్ద లభిస్తుంది. టాప్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 వద్ద అందుబాటులో ఉంటుంది. కాగా, శామ్సంగ్ గెలాక్సీ F23 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,499 వద్ద లభిస్తుంది. 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.18,499 వద్ద అందుబాటులో ఉంటుంది. రియల్మీ 9 5G 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 వద్ద, 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ.17,499 వద్ద అందుబాటులో ఉంటాయి.
కెమెరా
కెమెరా విషయానికి వస్తే,. ఐక్యూ Z6 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 2-మెగాపిక్సెల్ మాక్రో, 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా సెన్సార్లను అందించింది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ శామ్సంగ్ 3P9 కెమెరా సెన్సార్‌ను చేర్చింది. మరోవైపు, పోకో M4 ప్రో 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 64 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 -మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ F23 5Gలో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా-వైడ్, 2 మెగాపిక్సెల్స్ మాక్రో కెమెరాలను అందించింది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. రియల్మీ 9 5G 48MP ప్రైమరీ, 2MP మాక్రో, 2MP పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
డిస్ప్లే
ఐక్యూ Z6 5G 6.58 -అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పోకో M4 ప్రో 5G 6.43 -అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ F23 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గల 6.6 -అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రియల్మీ 9 5G 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్‌తో 6.5 -అంగుళాల 1080p డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ప్రాసెసర్
ఐక్యూ Z6 8GB RAM, 128GB స్టోరేజీ వేరియంట్ ఆక్టా-కో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. పోకో M4 ప్రో 5G ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G96 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 8GB RAMని కలిగి ఉంటుంది. ఈ ర్యామ్‌ను 11GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇక, శామ్సంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6GB ర్యామ్,6GB వరకు వర్చువల్ ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. రియల్మీ 9 5G 6GB RAM, 128GB స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ ద్వారా పనిచేస్తుంది.
బ్యాటరీ
ఐక్యూ Z6 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక, పోకో M4 ప్రో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు మద్దతిస్తుంది. ఈ ఫోన్‌ను 61 నిమిషాల్లో 0 నుండి 100 వరకు ఛార్జ్ చేస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ F23 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. రియల్మీ 9 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఐక్యూ Z6 5G స్మార్ట్‌ఫోన్ ఫన్‌టచ్ OS 12 లేయర్డ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పోకో M4 ప్రో 5G ఆండ్రాయిడ్ 11 పై రన్ అవుతుంది. శామ్సంగ్ గెలాక్సీ F23 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. రియల్మీ 9 5G ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ UI 2.0 పై రన్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.