పోకో (Poco) కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్(Phone Global) మార్కెట్లోకి లాంచ్ అయింది. పోకో ఎఫ్4 జీటీ (Poco F4 GT) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) కంపెనీ రిలీజ్ చేసింది. ఈ డివైజ్(Devise) మార్కెట్లో సరసమైన ఫ్లాగ్‌షిప్(Flagship) ప్రొడక్ట్‌గా(Product) కస్టమర్లను(Customers) ఆకర్షిస్తుందని పోకో చెబుతోంది. పోకో(POCO) నుంచి వచ్చిన ఈ కొత్త GT సిరీస్ ఫోన్(Series Phone), ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్‌తో(Hardware) వస్తుంది. అడ్వాన్స్‌డ్(Advanced) కూలింగ్ ఛాంబర్‌తో గేమింగ్ లవర్స్‌ను(Gaming Lovers) డివైజ్ టార్గెట్(Target) చేస్తుంది. పోకో F4 GT ఫోన్ చైనాలో(China) అందుబాటులో ఉన్న రెడ్‌మీ కే50 (Redmi K50) గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రీబ్యాడ్జ్ వెర్షన్. పోకో కొత్త GT స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాతో పాటు ఇతర దేశాలకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
పోకో F4 GT స్మార్ట్‌ఫోన్ ధర
పోకో F4 GT ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర EUR 600 (సుమారు రూ. 49,000) నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 256GB వెర్షన్ ధర EUR 700 (సుమారు రూ. 57,100)కి అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో దీని కచ్చితమైన ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ ఫోన్‌ను మన దేశంలో లాంచ్ చేసిన తర్వాతే, దీని ధరలను కంపెనీ ప్రకటించవచ్చు.
పోకో F4 GT స్పెసిఫికేషన్లు
పోకో F4 GT స్మార్ట్‌ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండే 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఈ డివైజ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ సరికొత్త ఫోన్ లిక్విడ్ కూల్ 3.0 టెక్నాలజీతో వస్తుంది. దీంట్లో డ్యుయల్ వేపర్ చాంబర్స్ ఉంటాయి. దీంతో ఈ ఫోన్‌లో ఎక్కువ సమయం గేమ్స్ ఆడినా, డివైజ్ హీట్ కాదు. ఈ కూలింగ్ సిస్టమ్ గేమర్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. పోకో F4 GT డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ MIUI 13 వెర్షన్‌తో పనిచేస్తుంది.
AP Tenth Social Model Paper: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సోషల్ పేపర్ ఎలా ఉంటుందంటే?
పోకో F4 GT ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. డివైజ్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఈ కెపాసిటీతో పోకో నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇప్పటికే ఈ యూనిట్ షియోమి 11i హైపర్‌ఛార్జ్, షియోమి 11T ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో ఉంది. ఈ సపోర్ట్‌తో ఫోన్ బ్యాటరీ 20 నిమిషాలలోపు 100 శాతం ఛార్జ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Mobile phone, POCO, POCO India, Smartphone, Smartphones, Technology