Home /News /technology /

LATEST MID RANGERS STACK AGAINST ONEPLUS NORD 2T VS IQOO NEO 6 VS POCO F4 5G UMG GH

Midrange Phones: మిడ్ రేంజ్‌లో మైండ్ బ్లోయింగ్ మొబైల్స్ ఇవే..! వన్‌ప్లస్, పోకో, ఐక్యూ నియోలో బెస్ట్ ఫోన్ ఏదంటే..?

పోకో, ఐక్యూ, వన్‌ప్లస్‌లో బెస్ట్ మొబైల్ ఏదంటే..?  (Image Credit: News18/ Darab Mansoor Ali)

పోకో, ఐక్యూ, వన్‌ప్లస్‌లో బెస్ట్ మొబైల్ ఏదంటే..? (Image Credit: News18/ Darab Mansoor Ali)

వన్‌ప్లస్‌ ఈ వారం ప్రారంభంలో ఇండియాలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 2T 5G (OnePlus Nord 2T 5G) ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐక్యూ నియో 6(iQoo Neo 6), పోకో F4 (Poco F4 5G) వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.

వన్‌ప్లస్‌ ఈ వారం ప్రారంభంలో ఇండియాలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 2T 5G (OnePlus Nord 2T 5G) ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన తాజా మిడ్‌ రేంజ్‌ ఫోన్‌. ఈ డివైజ్ 12GB వరకు RAM, ట్రిపుల్ రియర్‌ కెమెరా సెటప్, 4,500mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఐక్యూ నియో 6(iQoo Neo 6), పోకో F4 (Poco F4 5G) వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ రెండు మోడళ్లతో పోలిస్తే వన్‌ప్లస్‌ నార్డ్‌ 2T ఫోన్‌ ఎలాంటి స్పెషల్ ఫీచర్లు, స్సెసిఫికేషన్లను అందిస్తుందో చూద్దాం.

* ధరలు
వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ బేస్ వేరియంట్‌ 8GB RAM + 128GB ధర ఇండియాలో రూ.28,999గా ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ జులై 5 నుంచి మొదలయ్యాయి. ఇండియాలోని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్‌లలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఐక్యూ నియో 6 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో రూ.29,999కి అందుబాటులో ఉంది. భారతదేశంలో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ కోసం రూ.33,999 వెచ్చించాల్సి ఉంది.

పోకో ఎఫ్‌4 5జీ, లిస్ట్‌లోని మూడో మిడ్-రేంజ్‌ ఫోన్‌. దీని బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. భారతదేశంలో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, అదే విధంగా టాప్-స్పెసిఫికేషన్‌లు అందిస్తున్న 12GB RAM వేరియంట్ దేశంలో రూ.33,999గా ఉంది.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


* స్పెసిఫికేషన్‌లు
వన్‌ ప్లస్‌ నార్డ్‌ 2టీ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల E3 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఫీచర్‌లను అందిస్తోంది. ఇందులో ప్రైమరీ 50-మెగాపిక్సెల్ షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు వైపు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీ ఉంది.

ఐక్యూ నియో 6 స్మార్ట్‌ఫోన్‌ 6.62-అంగుళాల శామ్‌సంగ్ E4 AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌, 12GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఫీచర్‌లను అందిస్తోంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ISOCELL GWP1 ప్రైమరీ షూటర్, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందువైపు స్మార్ట్‌ఫోన్ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,700mAh బ్యాటరీ ఉంది.



పోకో ఎఫ్‌4 5జీ స్మార్ట్‌ఫోన్‌ కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్‌-HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 12GB RAM, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. ఇందులో ప్రైమరీ 64-మెగాపిక్సెల్ షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 20-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget smart phone, Oneplus, POCO, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు