మాజీ వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ స్థాపించిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి ఎట్టకేలకు మొదటి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) లాంచ్ అయింది. ప్రీమియం మిడ్-రేంజ్ ఆఫర్‌గా వచ్చిన ఈ ఫోన్ భారతదేశంలో రూ.32,999 ధరతో అందుబాటులో ఉంది. దేశంలోని కొన్ని అత్యుత్తమ ప్రీమియం మిడ్-రేంజర్‌లతో ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఉన్న మిడ్‌రేంజ్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్‌లు.. OnePlus Nord 2T 5G, iQoo Neo 6, Poco F4 5Gతో పోలిస్తే నథింగ్ ఫోన్(1) ఎలాంటి ఫీచర్‌లను అందిస్తుందో తెలుసుకోండి.
* నాలుగు ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయి..?
నథింగ్ ఫోన్(1) బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.35,999కు, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999కు లభ్యమవుతోంది. నథింగ్ ఫోన్ (1) భారతదేశంలో జులై 21 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. నథింగ్ ఫోన్(1) స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేస్తే, రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. వన్‌ప్లస్ కూడా నార్ట్ 2టీ 5జీ 12GB RAM మోడల్‌ను అందిస్తోంది. దీని ధర రూ.33,999గా ఉంది. ఐక్యూ నియో 6 ఫోన్ 8GB + 128GB మోడల్ రూ.29,999, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999కు లభిస్తాయి. పోకో ఎఫ్4 5జీ ఫోన్ బేస్ వేరియంట్ 6GB/128GB రూ. 27,999కు, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999కు, 12GB + 256GB వేరియంట్ రూ.33,999కు సొంతం చేసుకోవచ్చు.
* Nothong Phone(1) స్పెసిఫికేషన్లు
నథింగ్ ఫోన్(1) FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్‌తో, 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ ఉంది, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ JN1 సెన్సార్ ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ను అందిస్తుంది.
* ONEPLUS NORD 2T 5G స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ నార్డ్ 2టీ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే అందిస్తుంది. కొత్త MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్, గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్‌లతో వస్తుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం 32-మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
* IQOO NEO 6 స్పెసిఫికేషన్‌లు
ఐక్యూ నియో 6 స్మార్ట్‌ఫోన్ 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్‌తో 1080×2400 పిక్సల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 870 SoC, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్‌లను అందిస్తోంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 64-మెగాపిక్సెల్ ISOCELL GWP1 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ షూటర్‌తో వస్తుంది.
* POCO F4 5G స్పెసిఫికేషన్‌లు
పోకో ఎఫ్4 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాటన్ 870 చిప్‌సెట్, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ 64-మెగాపిక్సెల్ షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగాప్క్సెల్ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 20-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌తో వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, New mobiles, Smart phone, Tech news