Home /News /technology /

LAST SEEN FOR SELECT USERS TO STICKER MAKER FOR MOBILE APP WHATSAPP WORKING ON THESE 6 NEW FEATURES TO RELEASE IN 2022 SS

WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? 2022 లో రాబోయే 6 ఫీచర్స్ ఇవే

WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? 2022 లో రాబోయే 6 ఫీచర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? 2022 లో రాబోయే 6 ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp upcoming Features | కొత్త ఏడాదిలో కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. 2022 లో వాట్సప్ రిలీజ్ చేయబోయే 6 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ (WhatsApp Features) గురించి తెలుసుకోండి.

    వాట్సప్ యూజర్ల కోసం కొత్త సంవత్సరంలో కొత్త ఫీచర్స్ (WhatsApp Features) రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ యూజర్ల సంఖ్య 200 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. దాదాపుగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు అందరూ వాట్సప్ ఉపయోగిస్తున్నారు. సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్‌తో పోటీ ఎదుర్కొంటున్నా... తమ యూజర్ల కోసం వాట్సప్ అనేక కొత్తకొత్త ఫీచర్స్ (WhatsApp New Features) తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సప్ వెబ్‌లో ఇమేజ్ ఎడిటర్, డిసప్పియరింగ్ మెసేజెస్, వాయిస్ నోట్స్ ప్లేబ్యాక్ స్పీడ్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని పరిచయం చేసిన వాట్సప్... మరిన్ని ఫీచర్స్‌ని రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరి 2022 లో రాబోయే కొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి.

    Last seen for select users: వాట్సప్‌లో లాస్ట్ సీన్ అవతలివారికి కనిపించాలా వద్దా అనేది యూజర్ ఇష్టం. ఒక సెట్టింగ్ మారిస్తే అవతలివారికి లాస్ట్ సీన్ కనిపించదు. ఇకపై కొందరు యూజర్లకు మాత్రమే లాస్ట్ సీన్ కనిపించేలా చేయొచ్చు. అంటే సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కి లాస్ట్ సీన్ కనిపించకుండా చేయొచ్చు. ఈ ఫీచర్ 2022 లో రాబోతోంది.

    5G Smartphones: రూ.15,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ మోడల్స్

    Sticker Maker for Mobile App: వాట్సప్ వెబ్‌లో ఇప్పటికే స్టిక్కర్ మేకర్ ఫీచర్ వచ్చింది. త్వరలోనే వాట్సప్ మొబైల్ యాప్‌లో కూడా స్టిక్కర్ మేకర్ ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ వస్తే వాట్సప్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి స్టిక్కర్లు తయారు చేయొచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

    Communities: గ్రూప్ ఛాట్స్‌ని స్ట్రీమ్‌లైన్ చేసేందుకు కమ్యూనిటీ ఫీచర్ రూపొందిస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ఇప్పటికే డిస్కార్డ్ యాప్‌లో కమ్యూనిటీ ఫీచర్ ఉంది. వాట్సప్ కూడా అలాంటి ఓ ఫీచర్ రూపొందిస్తోంది. గ్రూప్ పైన అడ్మిన్‌కు మరింత కంట్రోల్ తీసుకొచ్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

    Playback Controls for Audio Messages: ఇప్పటికే వాయిస్ నోట్స్ ప్లేబ్యాక్ స్పీడ్ ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆడియో మెసేజెస్‌కు కూడా ఈ ఫీచర్ రానుంది. ఇతరుల నుంచి వచ్చే ఆడియో మెసేజెస్‌కు వాయిస్ నోట్స్‌కు కనిపించినట్టుగా 1.5X, 2X ప్లేబ్యాక్ స్పీడ్స్ కనిపిస్తాయి.

    Jio 2GB Plans: జియో ప్లాన్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

    Message Reactions: వాట్సప్‌లో మెసేజ్ రియాక్షన్ ఫీచర్ కోసం యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎవరైనా పంపిన వాట్సప్ మెసేజ్‌కు ఎమొజీ ద్వారా రియాక్షన్ ఇవ్వొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఈ ఫీచర్ ఉంది.

    New Time Limit for Disappearing Messages: వాట్సప్‌లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ కావడానికి డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 7 రోజుల వరకు టైమ్ సెట్ చేసుకోవచ్చు. త్వరలో ఈ టైమ్ లిమిట్‌ను 90 రోజులకు పెంచనుంది వాట్సప్.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు