ప్రస్తుత టెక్ యుగంలో మనం ఉపయోగించే అతి ముఖ్యమైన గాడ్జెట్లలో (Gadgets)ల్యాప్‌టాప్‌లు (Laptop) ఒకటి. ఓవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) కల్చర్ పెరగడం, మరోవైపు విద్యా విధానం ఆన్‌లైన్‌లోకి (Online) మారడంతో ల్యాప్‌టాప్‌ల అవసరం బాగా పెరిగింది. దీంతో కరోనా (Corona) సమయంలో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ సంస్థలు బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. భారత మార్కెట్లో నవంబర్‌లో రూ. 30 వేలలోపు లభిస్తున్న బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను పరిశీలిద్దాం.
ఆసుస్ పెంటియమ్ క్వాడ్ కోర్
- ఆసుస్ పెంటియమ్ క్వాడ్ కోర్ ల్యాప్‌టాప్ కేవలం రూ. 26,990 వద్ద లభిస్తుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్, 1TB HDD స్టోరేజ్‌తో వస్తుంది. ఇది క్వాడ్-కోర్ ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 10 అవుట్ ది బాక్స్ 1 సంవత్సరం ఆన్సైట్ వారంటీతో వస్తుంది.
హెచ్‌పీ క్రోమ్‌బుక్ N4020
హెచ్‌పీ క్రోమ్‌బుక్ N4020 ల్యాప్‌టాప్ కేవలం రూ. 26,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్ 14 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ eMMC స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇంటెల్ సెలిరోన్ N4020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ క్రోమ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. దీనిలో వాట్సాప్, యూట్యూబ్, ఎవర్‌నోట్, స్లాక్, అడోబ్ లైట్‌రూమ్ వంటి ప్రముఖ యాప్‌లకు యాక్సెస్‌ను అందించింది. మరోవైపు, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.
లెనోవో ఐడియా పాడ్ స్లిమ్1
లెనోవో ఐడియా పాడ్ స్లిమ్ 1 భారతదేశంలో రూ. 27,990 ధర వద్ద విడుదలైంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది 11.6-అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 4 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో వస్తుంది.
ఏసర్ ఎక్స్టెన్సా15 ఏఎమ్‌డీ 3020e
ఏసర్ ఎక్స్టెన్సా15 ఏఎమ్‌డీ 3020e ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో రూ. 29,990 వద్ద లభిస్తుంది. దీన్ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 15.6 -అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఏఎమ్‌డీ 3020e డ్యూయల్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మరోవైపు, స్టోరేజ్‌ను 1 టీబీ హెచ్డీడీ వరకు పెంచుకోవచ్చు.
హెచ్‌పీ 14 ఏ సెలిరాన్ డ్యుయల్ కోర్
హెచ్‌పీ 14 ఏ సెలిరాన్ డ్యుయల్ కోర్ ల్యాప్‌టాప్ రూ. 27,990 ధర వద్ద లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ 14- అంగుళాల WLED డిస్ప్లేతో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ eMMC స్టోరేజ్‌తో వస్తుంది. ఇది డ్యూయల్-కోర్ ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ క్రోమ్ ఓఎస్‌పై పనిచేస్తుంది.
అవిటా పురా ఏపీయూ డ్యుయల్ కోర్ A6 9220e
అవిటా పురా ఏపీయూ డ్యుయల్ కోర్ ల్యాప్‌టాప్ రూ. 24,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 14 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ కోర్ ఏఎండీ A6 9220e ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్‌తో వస్తుంది. విండోస్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ గల ఈ ట్యాప్‌టాప్‌ను విండోస్ 11కి అప్డేట్ చేయవచ్చు.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.