Windows PC Audio Problems: ల్యాప్‌టాప్ స్పీకర్లు పనిచేయడం లేదా? .. అయితే ఇలా చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

ల్యాప్‌టాప్‌(Laptop)లో అన్ని విభాగాలు బాగా ప‌ని చేస్తున్నా స్పీక‌ర్లు ప‌ని చేయ‌కుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ల్యాప్‌టాప్ నుంచి వ‌చ్చే శ‌బ్దాలు చాలా ఇబ్బంది పెడ‌తాయి. మీరు విండోస్‌10(Windows 10) వాడుతున్న‌ట్ల‌యితే మీ ల్యాప్‌టాప్ స్పీక‌ర్లు ప‌ని చేయ‌కుంటే ఏం చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    మ‌నం ల్యాప్‌టాప్ వాడుతున్న‌ప్పుడు వ‌చ్చే కొన్ని టోన్‌లు చాలా బాగుంటాయి. దాని వ‌ల్ల బాగా ప‌నిచేస్తుంది అనిపిస్తుంది కూడా. కానీ ల్యాప్‌టాప్‌(Laptop)లో అన్ని విభాగాలు బాగా ప‌ని చేస్తున్నా స్పీక‌ర్లు ప‌ని చేయ‌కుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ల్యాప్‌టాప్ నుంచి వ‌చ్చే శ‌బ్దాలు చాలా ఇబ్బంది పెడ‌తాయి. మీరు విండోస్‌10(Windows 10) వాడుతున్న‌ట్ల‌యితే మీ ల్యాప్‌టాప్ స్పీక‌ర్లు ప‌ని చేయ‌కుంటే ఏం చేయాలో తెలుసుకోండి.
    ముందుగా వాల్యూమ్ చెక్ చేయండి..
    అనుకోంకుండా మీరు వాడుతున్న ల్యాప్‌టాప్ మ్యూట్(Mute) అయిపోయి.. కార‌ణం తెలియ‌కుంటే ఇలా చేయాలి. ముందుగా టాస్క్‌బార్(Task Bar) కుడి వైపు దిగువ‌న ఉన్న స్పీక‌ర్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. వ్యాల్యూమ్ పెరిగిందా.. అన్‌మ్యూట్ చేయ‌బ‌డిందా అని ప‌రిశీలించుకోవాలి. అప్పుడు విండోస్ వాల్యూమ్ స్లైడ‌ర్‌ను లాగ‌డం వ‌ల్ల మీరు "డింగ్" అనే శ‌బ్దంతో నోట్‌ను వింటారు. అలా రాకుంటే స‌మ‌స్య మ‌రోద‌గ్గ‌ర ఉంద‌ని అర్థం. అనంత‌రం మీరు వాడుతున్న యాప్‌ల‌ను చెక్(Check) చేయండి అవేమైన మ్యూట్ చేయ‌బ‌డ్డాయో లేదో ప‌రిశీలించుకోండి. అవ‌న్ని స‌రిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి.

    Apple Mobile: "ఆపిల్" సూప‌ర్ ఆఫ‌ర్‌.. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో యూజ‌ర్ల‌కు ఉచిత స‌ర్వీస్




    ఒక‌వేళ్ ల్యాప్‌టాప్ స్పీక‌ర్(Speaker) స‌మ‌స్య ఉంటే.. బ‌య‌ట నుంచి స్పీక‌ర్ లేదా హెడ్‌ఫోన్‌ల‌నుప్ల‌గ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. మీ హెడ్‌ఫోన్ ప‌ని చేస్తే హార్డ్‌వేర్ స‌మ‌స్య‌గా గుర్తించాలి. యూఎస్‌బీ హెడ్‌ఫోన్‌(Head Phone)ను ప్ల‌గ్ చేయండి డీఫాల్ట్ ఆడియో డ్రైవ‌ర్‌ను దాట వేసి అస‌లు స‌మ‌స్య‌ను సూచిస్తుంది.
    అప్‌డేట్ చేయండి..
    ఒక‌వేళ మీ ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ ప‌ని చేయ‌క‌పోతే డ్రైవ‌ర్‌ల‌ను త‌నిఖీ చేయండి. ఇందు కోసం ముందుగా స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి అక్క‌డ 'డివైజ్ మేనేజర్'(Device Manager) అని టైప్ చేయండి. అక్క‌డ సౌండ్, వీడియో, ఆడియో అపుట్‌పుట్ ప‌రిక‌రాల‌ను చూపే మెనూ ఉంటుంది. అక్క‌డ మీ ఆడియో స‌మాచారంపై ఏదైనా ఆశ్చ‌ర్యార్థ‌కం గుర్తు ఉంటే మీరు ఆన్‌లైన్ ఆప్ష‌న్‌తో డ్రైవ‌ర్‌ల‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవ‌చ్చు.

    Netflix: iOS యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ప‌టిక‌ల్ ఆడియో


    అంతేకాకుండా ప్ర‌స్తుతం ఉన్న డ్రైవ‌ర్‌ల‌ను అన్ ఇన్‌స్టాల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అనంత‌రం సిస్ట‌మ్ రీబూట్(Reboot) చేయ‌డం ద్వారా తిరిగి వాటిని ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు. అనంత‌రం స్పీక‌ర్‌లు బాగా ప‌ని చేస్తాయి. ఒక వేళ ఆడియోలో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఆడియో డిసేబుల్ చేయాల‌ని మైక్రోసాఫ్ట్(Microsoft) యూజ‌ర్ల‌కు సూచిస్తుంది. ఇందు కోసం సౌండ్ మెనూ లోకి వెళ్లి ఆడియో డివైస్‌ల‌ను ఎంచుకోవాలి. అనంత‌రం వాటి ప్రాప‌ర్టీలోకి వెళ్లాలి. అక్క‌డ స‌పోర్టెడ్(Supported) ఫార్మెట్‌ను ఎంచుకోని చెక్ చేయాలి. అనంత‌రం ఆడియోను ప్లే(Audio play) చేయండి స‌మ‌స్య ఎక్క‌డుందో చూపుతుంది లేదా ప‌రిష్క‌రిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published: