హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio-Krikey నుంచి కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్ గేమ్ YAATRA..పబ్‌జీకి పోటీ ఇదే...

Jio-Krikey నుంచి కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్ గేమ్ YAATRA..పబ్‌జీకి పోటీ ఇదే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్ గేమింగ్ (Augmented Reality mobile gaming) సంస్థ క్రికీ(Krikey) , జియో (Jio)తో కలిసి భారతదేశంలో కొత్తగా రియాలిటీ గేమ్ యాత్రా(YAATRA) ను ప్రారంభించింది.

టెలికాం రంగంలో దూసుకెళ్తున్న జియో నెట్ వర్క్ ఇప్పుడు గేమింగ్ రంగంలో కూడా అద్భుతాలను సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. పబ్ జీ లాంటి విదేశీ గేమ్స్ ను కేంద్ర ప్రభుత్వం నిశేధం విధించిన తర్వాత గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకమైన టెక్నాలజీతో ఈ గేమ్ ను క్రికీ సంస్థ రూపొందించగా, జియో సంస్థ ఈ గేమ్ ను తన వినియోగదారులకు అందిస్తోంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్  గేమింగ్ (Augmented Reality mobile gaming) సంస్థ క్రికీ(Krikey) , జియో (Jio)తో కలిసి భారతదేశంలో కొత్తగా రియాలిటీ గేమ్  యాత్రా(YAATRA) ను ప్రారంభించింది.  జియో సిరీస్ ఏ ఫండింగ్ ద్వారా  క్రికీ సంస్థలో మొత్తం 22 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను పెంచడం విశేషం.  ఈ సందర్భంగా  క్రికీ వ్యవస్థాపకులు  జాన్వి, కేతకి శ్రీరామ్,తమ స్పందనలు తెలియజేశారు. “క్రికీ ద్వారా తాము ఏదైతే ఊహించామో, వాటిని వాస్తవికతను జోడించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాము. అంతేకాదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా ఫాంటసీ ప్రపంచాలను మీ కళ్ల ముందుకు తీసుకురాగలుగుతున్నామని" ఈ సందర్భంగా క్రికీ ప్రతినిధులు తెలిపారు. కేవలం  మొబైల్ ఫోన్ కెమెరాతో, ప్లేయర్స్ యాత్రా  యాక్షన్-అడ్వెంచర్ గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఇందులో ఒక రాక్షస సైన్యాన్ని ఓడించడం ఈ గేమ్ ప్రారంభించాల్సి ఉంటుంది. ధనస్సు, బాణం, చక్రం, మెరుపులు,  ఫైర్ బోల్ట్ వంటి ఆయుధాలను ఉపయోగించి, ఆటగాళ్ళు వివిధ స్థాయిల పోరాట మరియు పజిల్ ఆటల ద్వారా ఇందులో పోరాడవచ్చు.

వినియోగదారులు వారి గేమ్‌ప్లేని పూర్తి చేసిన తర్వాత, వారు పర్సనలైజ్డ్ వీడియోను స్నేహితులతో పంచుకోవడానికి ఎంచుకోవచ్చు. ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన గేమ్‌ప్లే వీడియోలను చూడటానికి వీడియో ఫీడ్‌లు, ఆటగాళ్ళు మళ్లీ ఆడటానికి ముందు వారి విల్లు మరియు బాణం నైపుణ్యాలను అభ్యసించగల డిజిటల్ శిక్షణా మైదానం కూడా ఉన్నాయి.

Jio వినియోగదారు దీనిని ఎలా పొందుతారు:

- 3 డి అవతార్ ఫీచర్

- గేమ్ ప్లే టోకెన్లు (అదనపు ఆయుధాలు మరియు శక్తులను అన్‌లాక్ చేయడానికి)

- గేమ్ స్థాయిలు

ఈ సందర్భంగా జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఇలా వ్యాఖ్యానించారు, "ఆగ్మెంటెడ్ రియాలిటీని స్వీకరించడానికి క్రికీ  సంస్థ యువ తరం భారతీయులను ప్రేరేపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ అనుభవాలను భారతదేశానికి తీసుకురావడంలో తొలి అడుగుగా  యాత్రా వీడియో గేమ్ ను పరిచయం చేస్తున్నాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్ వినియోగదారుని దాని ఓ వింత ప్రపంచంలోకి తీసుకువెళుతుంది  యాత్రా ద్వారా AR ను అనుభవించడానికి ప్రతి జియో మరియు జియోయేతర వినియోగదారులను మేము ఆహ్వానిస్తున్నాము. ” అని ఆయన తెలిపారు.  క్రికీ ఇప్పుడు IOS యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్లలో ఉచితంగా లభిస్తుంది.


' isDesktop="true" id="677636" youtubeid="SBMK9itaGxk" category="technology">

ఈ వీడియోలో యాత్రా వీడియోగేమ్ ప్రోమోను చూడండి...

First published:

Tags: Jio, Jio phone, Reliance Jio

ఉత్తమ కథలు