హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Battlegrounds Mobile India: వీడియో గేమ్ లవర్స్‌కు షాక్... ఒక్క వారంలోనే లక్ష 42 వేల BGMI అకౌంట్లు బ్యాన్

Battlegrounds Mobile India: వీడియో గేమ్ లవర్స్‌కు షాక్... ఒక్క వారంలోనే లక్ష 42 వేల BGMI అకౌంట్లు బ్యాన్

Battlegrounds Mobile India: వీడియో గేమ్ లవర్స్‌కు షాక్... ఒక్క వారంలోనే లక్ష 42 వేల BGMI అకౌంట్లు బ్యాన్
(image: BGMI)

Battlegrounds Mobile India: వీడియో గేమ్ లవర్స్‌కు షాక్... ఒక్క వారంలోనే లక్ష 42 వేల BGMI అకౌంట్లు బ్యాన్ (image: BGMI)

BGMI Account Banned | బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ ఆడేవారికి క్రాఫ్టన్ షాక్ ఇచ్చింది. ఒక్క వారంలోనే 1,42,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. ఎందుకో తెలుసుకోండి.

పబ్‌జీ గేమ్ బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా (BGMI) పేరుతో ఇండియన్ ప్లేయర్లకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గేమ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన సమయం నుంచి క్రాఫ్టన్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ప్లేయర్లను ఆకట్టుకుంటోంది. ఈ గేమ్‌లో చీటింగ్ యాక్టివిటీస్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా క్రాఫ్టన్ (Krafton) ఏకంగా ఒక్క వారంలోనే 1 లక్షా 42 వేల బీజీయంఐ అకౌంట్లను బ్యాన్ చేసింది. చీటింగ్ పాల్పడుతున్న అకౌంట్లను గుర్తించి డిసెంబర్ 6 నుంచి 12 వరకు దాదాపు లక్షన్నర బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది.

అంతేకాదు తన అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాన్ చేసిన అకౌంట్ల జాబితాను పొందుపరిచింది. క్రాఫ్టన్ తన వెబ్‌సైట్‌లో డిసెంబర్ రెండవ వారంలో 1,42,766 ఇల్లీగల్ అకౌంట్లను నిషేధించినట్లు డిసెంబర్ 15న ఓ పోస్ట్ చేసింది. ఈ అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేయగా వీటిని మళ్లీ ఉపయోగించి ప్లేయర్లు గేమ్‌లో ఆడలేరు. ఆటగాళ్లకు ఆహ్లాదకరమైన గేమింగ్ ఎన్విరాన్మెంట్ అందించడానికి చీటింగ్ ప్రోగ్రామ్‌ల వాడకాన్ని నిర్మూలించే లక్ష్యంతో కఠిన ఆంక్షలను అమలు చేస్తామని క్రాఫ్టన్ తన పోస్ట్‌లో పేర్కొంది.

Joker Malware: ఈ యాప్ మీ ఫోన్‌లో ఉందా? వెంటనే డిలిట్ చేయండి

నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకు 1,57,000 ఖాతాలను నిషేధించినట్లు గత నెలలో బీజీయంఐ ప్రకటించింది. ప్లే స్టోర్ కాకుండా ఇతర ప్లాట్‌ఫాం నుంచి గేమ్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా హ్యాక్ ఇన్‌స్టాల్ చేయడం వంటి ఏదైనా చీటింగ్ కార్యకలాపాలను గుర్తించినట్లయితే, క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటీసు పంపుతుంది. ఆటగాళ్లు అప్రమత్తం కాకపోతే వారి అకౌంట్ శాశ్వతంగా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

డిసెంబర్​ 31 తర్వాత డేటా ట్రాన్స్​ఫర్​ నిలిపివేత..


డిసెంబర్ 31 తర్వాత భారతీయ ఆటగాళ్లకు పబ్‌జీ మొబైల్ నుంచి డేటా బదిలీని నిలిపివేస్తున్నట్లు ఇటీవలే బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రకటించింది. ఆటగాళ్లు తమ పబ్‌జీ మొబైల్ డేటాను డిసెంబర్ 31లోగా బదిలీ చేసుకోవాల్సిందిగా క్రాఫ్టన్ సూచించింది. బీజీయంఐ యూజర్లు తమ డేటాను పబ్‌జీ మొబైల్ నుంచి ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ లాగిన్‌ల ద్వారా బదిలీ చేయడానికి మొదటి నుంచి క్రాఫ్టన్ అనుమతించింది.

Jio 1.5GB Data plans: జియో యూజర్లకు రోజూ 1.5జీబీ డేటా ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

ఇండియన్ ప్లేయర్‌లు గతంలో ఏ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పబ్‌జీ మొబైల్ లో లాగిన్ అయ్యారో.. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఖాతాను బీజీయంఐలో ఉపయోగించి ఓల్డ్ డేటాను బదిలీ చేసుకోవచ్చు. వేరు వేరు అకౌంట్లతో డేట్ డేటా బదిలీ సాధ్యం కాదు.బ్రౌజర్‌ని ఉపయోగించి ఫేస్‌బుక్ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ను గత నెలలో డెవలపర్లు నిలిపివేశారు. ఇప్పుడు, ఫేస్‌బుక్ ద్వారా బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియాలో లాగిన్ అవ్వాలంటే ప్లేయర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Battlegrounds Mobile India, Video Games

ఉత్తమ కథలు