ట్విట్టర్ (Twitter) నచ్చని భారత యూజర్లు ఎక్కువగా ఆశ్రయించే మైక్రోబ్లాగింగ్ సైట్ యాప్ కూ (Koo). ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా దేశీయ కూ ప్లాట్‌ఫామ్ సూపర్ పాపులర్ అయింది. దీని యూజర్ బేస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే యూజర్ల సంఖ్యను ఇంకా పెంచుకునేందుకు, ఉన్న యూజర్లను కాపాడుకునేందుకు ఈ యాప్ నిత్యం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా తాజాగా యూజర్ల సేఫ్టీనే లక్ష్యంగా కొత్త కంటెంట్ మోడరేషన్ ఫీచర్లను పరిచయం చేసింది. ఈ సరికొత్త ఫీచర్లు నగ్నత్వం (Nudity), పిల్లల లైంగిక వేధింపుల (Child Abuse) వంటి అనుచితమైన కంటెంట్‌ను ఐదు సెకన్లలో కనుగొని యాప్ నుంచి తొలగిస్తాయి.
కూ యాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్లు హానికరమైన లేదా అవాస్తవమైన నోట్స్, కామెంట్స్ గుర్తించి వాటిని యూజర్ల నుంచి దాచగలవు. ద్వేషపూరిత మెసేజ్‌లు పోస్ట్ కాకుండా ఆపగలవు. కూ రీసెంట్‌గా లాంచ్ ఒక్కో సెక్యూరిటీ ఫీచర్ ఒక్కో ప్రత్యేకమైన పనిని చేస్తూ ప్లాట్‌ఫామ్‌ను అత్యంత సురక్షితంగా ఉంచగలవు.
* నో న్యూడిటీ అల్గారిథమ్
Koo యూజర్లు లైంగిక కంటెంట్ లేదా పిల్లల వేధింపుల దృశ్యాలు ఉన్న వీడియో లేదా ఫొటోలను అప్‌లోడ్ చేయకుండా గుర్తించి బ్లాక్ చేసే "No Nudity Algorithm" వ్యవస్థను ప్లాట్‌ఫామ్‌కు జోడించింది. ఈ సిస్టమ్ ఆ తరహా కంటెంట్‌ను ఐదు సెకన్లలోపు గుర్తించి బ్లాక్ చేయగలదు. ఒక వినియోగదారు అనుచితమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, వారు పోస్టింగ్ చేయకుండా కొత్త ఫీచర్ ఆపుతుంది. అంతేకాకుండా వారు అకౌంటు, పోస్టులు ఇతరులకు కనిపించకుండా చేస్తుంది. వారి పోస్టులు ట్రెండింగ్ పోస్ట్‌లలో అసలు కనిపించవు. అలాగే వారు ఇతరులతో ఇంటరాక్ట్ కావడం కూడా కష్టం అవుతుంది. ఈ ఫీచర్ హానికరమైన వారికి కళ్లెం వేస్తుంది.
* నేరుగా కనిపించని హింసాత్మక పోస్టులు
ఇక ఏదైనా పోస్ట్‌లో హింస ఎక్కువగా ఉంటే, వినియోగదారులు దానిని చూసే ముందు ఒక హెచ్చరిక మెసేజ్‌ను చూస్తారు. తద్వారా వినియోగదారులు చూడవద్దు అనుకున్న హింసాత్మక పోస్టులను చూడకుండా జాగ్రత్త పడొచ్చు.
* ఫేక్ న్యూస్‌కి నో ఛాన్స్
కూ "Misinfo & Disinfo అల్గారిథమ్" టూల్‌ను సైతం పరిచయం చేసింది. ఈ ఫీచర్ పబ్లిక్, ప్రైవేట్ సోర్స్‌లను ఉపయోగించి తన ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అన్ని వైరల్, రిపోర్ట్ ఫేక్ న్యూస్‌లను నిరంతరం చెక్ చేస్తుంది. పోస్ట్‌లలో నకిలీ సమాచారాన్ని కనుగొంటుంది. వాటిని లేబుల్ చేస్తుంది, ఇది ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆపుతుంది.
ఇది కూడా చదవండి : ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి
* ఫేక్ అకౌంట్స్‌కు చెక్
సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు లేదా వివరణలతో సెలబ్రిటీగా కనిపించడానికి ప్రయత్నించే ఖాతాలకు కూడా కూ యాప్ చెక్ పెట్టనుంది. ఇలాంటి పనులు చేసే వారిని వెతకడానికి "MisRep అల్గారిథమ్" అనే సాధనాన్ని యాప్ ఉపయోగిస్తుంది. ఈ అల్గారిథమ్ (Algorithm) ఫేక్ అకౌంట్స్ కనుగొన్నప్పుడు, అది వాటి నుంచి పాపులర్ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను చాలా వేగంగా తొలగిస్తుంది. భవిష్యత్తులో ఈ ఖాతాలు ఏ తప్పు చేయకుండా వాటిని ఫ్లాగ్ చేసి పర్యవేక్షిస్తుంది.
Koo కొత్త ఫీచర్ ద్వేషపూరితమైన స్పీచ్ (Hate Speech) లేదా విషపూరితమైన కామెంట్ల (Toxic Comments)ను త్వరగా కనుగొని తొలగిస్తుంది. కాబట్టి వాటిని ఇతర వ్యక్తులు చూడలేరు. తొలగించడం అనేది కేవలం 10 సెకన్లలోపు జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New features, Safety, Tech news, Twitter