Komaki MX3: సింగిల్ చార్జ్‌తో 100 కి.మీ. మైలేజ్.. ఈ కొత్త బైక్ రేట్ ఎంతో తెలుసా?

కోమకి ఎంఎక్స్ 3 బైక్

ఈ ఏడాది కోమకి లాంచ్ చేసిన నాలుగో ఎలక్ట్రిక్ బైక్ ఇది. కోమకి ఎంఎక్స్ 3 బైక్ సింపుల్ స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. 1.5 యూనిట్ల కరెంట్‌తో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే 85 నుంచి 100 కి.మీ. వరకు ఈ బైక్ ప్రయాణిస్తుంది.

  • Share this:
    ప్రపంచమంతటా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అంతేకాదు ఇంధన ధరలు కూడా మండిపోతున్నాయి. అందుకే ఇటు ప్రభుత్వాలు.. అటు ప్రభుత్వాలు కూడా.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. స్టార్టప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ బైక్స్ భారత మార్కెట్‌లోకి వచ్చాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ కోమకి (Komaki) MX3 పేరుతో మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

    ఈ ఏడాది కోమకి లాంచ్ చేసిన నాలుగో ఎలక్ట్రిక్ బైక్ ఇది. కోమకి ఎంఎక్స్ 3 బైక్ సింపుల్ స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. 1.5 యూనిట్ల కరెంట్‌తో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే 85 నుంచి 100 కి.మీ. వరకు ఈ బైక్ ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే బ్యాటరీని బయటకు తీసి చార్జింగ్ పెట్టుకోవచ్చు. కోమకి ఎంఎక్స్ బైక్‌ను 17 ఇంచుల చక్రాలతో రూపొందించారు. ముందు వెనక ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నాయి. అంతేకాదు ఇందులో అద్భుతమైన ఫీచర్ ఉంది.బైక్‌లో ఏదైనా సమస్య వస్తే దానంతటే గుర్తించి రిపేర్ చేసుకుంటుంది. ఐతే అది ఎలా పనిచేస్తుందనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

    కోమకి ఎంఎక్స్ 3 బైక్‌లో సీటు పొడవుగా ఉంది. కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. ఇది రెడ్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మూడు రైడింగ్స్ మోడ్స్ ఉంటాయి. బ్లూ టూత్ స్పీకర్, ఎల్‌ఈడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అదనపు ఆకర్షణలు. ఇంతకు ఈ బైక్ ధరంతో తెలుసా.. రూ.95వేలు. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. రిజిస్ట్రేషన్, ట్యాక్స్‌లు కలిపితే మరింత పెరుగుతుంది. ఐతే మిగతా ఎలక్ట్రిక్ బైక్స్‌తో పోల్చితే.. దీని ధర కాస్త తక్కువే. ఇటీవల టూ వీలర్ మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి. అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో అందుబాటు ధరలో.. అద్భుతమైన ఫీచర్లు, మైలేజీ ఇచ్చే బైక్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: