4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!

భారతదేశంలో 4జీ నెట్‌వర్క్ విస్తరించిన నగరాల్లో 90.73 శాతంతో కోల్‌కతా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 86.22 శాతంతో ఏపీ సర్కిల్ 15వ స్థానంలో ఉంది. లండన్‌కు చెందిన ఓపెన్ సిగ్నల్ సంస్థ వెల్లడించిన వివరాలివి.

news18-telugu
Updated: September 6, 2018, 1:02 PM IST
4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో 4జీ నెట్‌వర్క్ చాలా వేగంగా విస్తరించింది. ఇండియాలో ఏఏ సర్కిల్స్‌లో 4జీ ఎక్కువగా విస్తరించిందని లండన్‌కు చెందిన వైర్‌లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్‌సిగ్నల్ జరిపింది. 90.73 శాతంతో కోల్‌కతా మొదటి స్థానంలో నిలిచినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. అయితే మిగతా 21 సర్కిళ్లల్లో 4జీ నెట్‌వర్క్ విస్తరణ తక్కువేమీ లేదు. అన్ని సర్కిళ్లల్లో 80 శాతానికి పైనే 4జీ నెట్‌వర్క్ విస్తరించింది.

Kolkata top in 4G availability, AP circle in 15th place, 4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!

కోల్‌కతా తర్వాత పంజాబ్(89.8%), బీహార్(89.2%), మధ్యప్రదేశ్(89.1%), ఒడిశా(89%) సర్కిళ్లున్నాయి. 4జీ విస్తరణపై ఓపెన్ సిగ్నల్ తాజా అధ్యయన ఫలితాలను బట్టి 2012 నుంచి ఇండియాలో 4జీ నెట్‌వర్క్ అంతే స్పీడ్‌లో విస్తరించినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే టాప్ సర్కిళ్లలో తూర్పు, ఉత్తర ప్రాంతాలకు చెందినవే ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీ 12వ స్థానంలో, ఆర్థిక రాజధాని ముంబై 13వ స్థానంలో ఉండటం విశేషం.

ఇండియాలో 4జీ విస్తరణలో రిలయెన్స్ జియో పాత్ర చాలా కీలకమని మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్) ఇటీవల తెలిపింది. డిసెంబర్ 2017 నాటికి 23.8 కోట్ల 4జీ యూజర్లలో 8.3 కోట్ల మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం. 2020 నాటికి 35 శాతం మంది అంటే 43.2 కోట్ల యూజర్లు 4జీ ఉపయోగిస్తారని ఆ సంస్థ అంచనా.
First published: September 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading