టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నకొద్దీ డిజిటల్ అకౌంట్స్‌కి ఎలాంటి సేఫ్టీ లేకుండా పోయింది. బలమైన పాస్వర్డ్స్ (Strong Passwords) సెట్ చేసుకున్నా అవి హ్యాకింగ్ గురవుతున్నాయి. దీనివల్ల పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతిలో పడిపోతుంది. ఇలాంటి ప్రమాదకరమైన సైబర్ అటాక్స్ నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో (Two-Factor Authentication) బయటపడవచ్చు. కేవలం పాస్వర్డ్స్ మాత్రమే సెట్ చేసుకొని వదిలేస్తే హ్యాకర్లకు దానిని యాక్సెస్ చేయడం సులభతరమవుతుంది. అదే పటిష్ఠమైన ఆన్లైన్ సెక్యూరిటీ అందించే మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Multi-factor authentication) కూడా సెట్ చేసుకుంటే సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకునే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. యూజర్లు తమ అన్ని డిజిటల్ అకౌంట్స్‌కు ఎందుకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయడం ద్వారా మీ డిజిటల్ అకౌంట్‌కి మీరైనా లేక ఇతరులైనా లాగిన్ అయ్యేటప్పుడు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) మీ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా వస్తుంది. ఆ లాగిన్ అటెమ్ట్ సక్సెస్ కావాలంటే మీ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నంబర్ ఇతరులకు తెలిసే ఛాన్సే లేదు కాబట్టి అదనపు సెక్యూరిటీ లభిస్తుంది. మీ అకౌంట్‌కు యాక్సెస్ ఇవ్వడానికి ఫింగర్‌ప్రింట్ IDని కూడా ఇవ్వచ్చు. లేదంటే ఫేస్ ఐడీ కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల అకౌంట్ హ్యాక్ చేయడం అవతలివారికి అసాధ్యంగా మారుతుంది.
పాస్వర్డ్స్ ఈజీగా గుర్తుండేలా చాలామంది వీక్ పాస్వర్డ్స్ సెట్ చేసుకుంటుంటారు. ఇది రిస్కుతో కూడుకున్నది. అయితే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకుంటే వీక్ పాస్వర్డ్స్ సెట్ చేసుకున్నా పటిష్ఠమైన సెక్యూరిటీ లభిస్తుంది. ఎందుకంటే హ్యాకర్ మీ నుంచి లాగిన్ పర్మిషన్ తీసుకోకుండా మీ అకౌంట్‌కు లాగిన్ కాలేరు.
ఈ రోజుల్లో పాస్వర్డ్లు డిజిటల్ అకౌంట్స్‌కి అంతగా సెక్యూరిటీ అందించడం లేదు. పాస్వర్డ్లు అందించలేని సెక్యూరిటీని టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో పొందొచ్చు. ఈ ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్‌తో యాక్సిడెంటల్ సైన్-ఇన్లను సమర్థవంతంగా ఆపవచ్చు. హ్యాక్ చేయడానికి ప్రయత్నించే అజ్ఞాత వ్యక్తికి సులభంగా యాక్సెస్‌ను తిరస్కరించవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ వంటి చాలా అకౌంట్లను ఈ సెక్యూరిటీ మెథడ్‌తో సురక్షితంగా ఉంచుకోవచ్చు.
iPhone Offer: ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు... జస్ట్ రూ.32 వేలకే ఐఫోన్ కొనొచ్చు
కంపెనీలకు సైబర్ దాడుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. రిమోట్‌గా పని చేసే కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా డివైజ్‌లు ఉంటాయి. వాటన్నిటికీ IT సిబ్బంది టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయకపోతే.. రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ ఆన్ చేస్తే చాలావరకు సైబర్ దాడులను ఎదుర్కోవచ్చు. ఈ 2FA ని కావలసినప్పుడు టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber Attack, Google, Laptop, Smartphone