దూరప్రాంతాలకు వెళ్లేవారు టీఎస్ఆర్టీసీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టికెట్లు బుక్ చేస్తుంటారు. లేదా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ఆయా రాష్ట్రాల బస్సు సర్వీసుల్ని ఉపయోగించుకుంటారు. బస్సులో టికెట్స్ బుక్ చేసేప్పుడు తమకు ఏ సీట్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రయాణికులు కోరుకున్న సీటును ఎంపిక చేసుకునే అవకాశం బస్ టికెట్ రిజర్వేషన్లో (Bus Ticket Reservation) ఉంటుంది. సినిమా టికెట్లు కూడా ఇలాగే బుక్ చేయొచ్చు. మరి ఇంత టెక్నాలజీ పెరిగినా ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు (Train Ticket Booking) సీటు సెలెక్ట్ చేసే సదుపాయం ఎందుకు ఉండదు? ఈ డౌట్ మీకు కూడా వచ్చిందా? ఇందుకు ఓ కారణం ఉంది. రైలు బెర్తుల్ని కేటాయించడం వెనుక సైన్స్ ఉంది. అదేంటో తెలుసుకోండి.
రైలులో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్ అని వేర్వేరుగా బెర్తులు ఉంటాయి. ప్రయాణికులు ఆ బెర్తుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రయాణికులు లోయర్ బెర్త్ సెలెక్ట్ చేస్తే, అవకాశం ఉంటే లోయర్ బెర్త్ వస్తుంది. లేదా మరో బెర్త్ వస్తుంది. కానీ బస్ టికెట్ రిజర్వేషన్లో ఉన్నట్టుగా ఫలానా నెంబర్ బెర్త్ మాత్రమే కావాలని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు.
IRCTC Ticket Booking: రైలు టికెట్ల బుకింగ్ ప్రాసెస్ మారింది... ఈ విషయాలు తెలుసుకోండి
బస్సులో, సినిమా హాల్లో కావాల్సిన సీటు కోరుకోవడం వేరు. రైలులో సీటు సెలెక్ట్ చేయడం వేరు. సినిమా హాల్ కదిలేది కాదు. బస్సు విషయానికి వస్తే రైలు కన్నా చిన్నగా ఉంటుంది. కానీ రైలులో బోగీ పెద్దగా ఉంటుంది. వరుసగా ఒక బోగీకి మరో బోగీ ఎటాచ్ అయి ఉంటుంది. కాబట్టి వెయిట్‌ని బ్యాలెన్స్ చేయడం అవసరం. అందుకు తగ్గట్టుగానే ఐఆర్సీటీసీ ఆల్గరిథమ్ పనిచేస్తుంది. వెయిడ్ బ్యాలెన్స్ చేస్తూ బెర్తులు కేటాయించడంలో ఐఆర్సీటీసీ ఆల్గరిథమ్ ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు రైలులో T1, T2, T3 నెంబర్స్‌తో 10 బోగీలు ఉన్నాయనుకుందాం. ప్రతీ బోగీలో 72 సీట్లు ఉంటాయి. ఆ రైలులో తొలి ప్రయాణికులు టికెట్ బుక్ చేస్తే అతనికి T1 బోగీలోని మొదటి బెర్త్ కేటాయించరు. రైలు మధ్యలో ఉన్న బోగీలో బెర్త్ కేటాయిస్తుంది ఐఆర్సీటీసీ. ఆ కోచ్‌లో కూడా మొదటి సీటు కేటాయించదు. బోగీలోని మధ్యలో ఉన్న బెర్తుల్ని కేటాయిస్తుంది. ఇలా సీట్లు కేటాయిస్తూ కోచ్ తలుపుల వరకు వెళ్తుంది. గురుత్వాకర్షణ కేంద్ర తక్కువగా ఉండేలా మొదట లోయర్ బెర్త్ కేటాయిస్తుంది.
IRCTC Tours: తిరుపతి నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు... రూ.990 ధరకే లోకల్ టూర్
ప్రతీ బోగీలో ప్రయాణికులు సమానంగా ఉండేలా బెర్తుల్ని కేటాయించుకుంటూ వెళ్తుంది ఐఆర్సీటీసీ సాఫ్ట్వేర్. మొత్తంగా రైలులోని అన్ని బోగీల్లో సమానమైన ప్రయాణికులు ఉండేలా చూస్తుంది. దీని వల్ల రైలు బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఇలా బెర్తుల కేటాయింపు వల్ల రైలు పట్టాలు తప్పే అవకాశాలు తగ్గుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways, Train tickets