మనం రోజు ఎన్నో గూగుల్ సంబంధిత యాప్‌లను ఉపయోగిస్తాం. ప్రతీ యాప్‌లో ఎన్నో స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. వీటిని వినయోగించడం వల్ల మనం రోజు చేసే పనులను వేగంగా చేయగలుగుతాం. ఎంతో సులభంగా ఈ ఫీచర్స్‌ని వినియోగించుకోవచ్చు కూడా నిజానికి మనం ఎంతో కాలంగా గూగుల్ యాప్‌లను వాడుతున్నప్పటికి ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయనే గుర్తించం. సెట్టింగ్‌లలో చిన్న మార్పులతో మనం వాటిని వినియోగించ వచ్చు.
మీ గురించి గూగుల్‌కి ఏం తెలుసో తెలుసుకోవచ్చు..
మీ గురించి గూగుల్ వద్ద ఉన్న సమాచారాన్ని పొందడం చాలా సులభం. Takeout.google.com అనే వెబ్‌సైట్‌కు వెళ్లండి. అందులో ఆల్ డేటా క్యాటగిరి ఎక్స్‌పోర్ట్‌ను ఎంచుకోండి. అనతరం ఏ విధంగా సమాచారం పొందలనుకుంటున్నారు అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ మెయిల్ ద్వారానా లేక గూగుల్ డ్రైవ్ ద్వారానా అనే వివరాలు ఇవ్వాలి. వెంటనే మీ గురించి గూగుల్ వద్ద ఉన్న సమాచారం మీ వద్దకే వస్తుంది.
పంపిన మెయిల్‌ను రద్దు చేయడం ఎలా...
మనం చాలా ముఖ్యమైన మెయిల్‌ను పంపుతాం.. ఒక్కో సారి సెండ్ చేసిన తర్వాత వెంటనే ఒక్క చిన్న మార్పు చేస్తే బాగుండని గుర్తు వస్తుంది. కానీ ఏం చెయ్యలేం.. సెండ్ చేశాంగా అనుకుంటాం. కానీ జీమెయిల్లో పంపిన మెయిల్‌ను ఆపే అవకాశం ఉంది.. అది ఎలాగో చూడండి..
ముందుగా మీరు మెయిల్ ఓపెన్ చేశాక కుడివైపు పైన సెట్టింగ్‌లోకి వెల్లండి.
అందులో ఆల్ సెట్టింగ్ లోకి వెళ్లండి
అందులో జనరల్ సెట్టింగ్‌లో అన్‌సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో గరిష్టంగా 30 సెకన్లు పెట్టుకోవచ్చు. అది ఎంచుకొంటే మీరు పంపిన మెయిల్‌ను 30 సెకన్లలోపు అన్‌సెండ్ చేయొచ్చు. ఈ సారి ఎప్పుడైనా అన్‌సెండ్ చేయాలనిపిస్తే ఈ ఆప్షన్‌ను గుర్తు పెట్టుకోండి.
ఆఫ్‌లైన్ గూగుల్ యాప్‌ల వినియోగం..
చాలా గూగుల్ యాప్‌లు ఆన్లైన్లో పని చేస్తాయి. వాటిని ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగించుకోవచ్చు గూగుల్ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో వినియోగించుకునేందుకు కొన్ని సెట్టింగులు మార్చుకొంటే చాలు..
ముందుగా మీరు ఆఫ్‌లైన్‌లో వినియోగించుకోవాలనుకొన్న గూగుల్ యాప్‌ను బ్రౌజర్లో తెరవండి
అందులో Drive.google.com/driveను తెరిచి సైన్ అవ్వండి.
అనంతరం కుడివైపు పైన ఉన్న గేర్ చిహ్నాన్ని క్లిక్ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లండి.
అక్కడ ఆఫ్‌లైన్ విభాగంలో మీరు వినియోగించుకోగల గూగుల్ యాప్‌కు సంబంధించి ఆఫ్‌లైన్‌లో పని చేయడం అనే ఆప్షన్ చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని టిక్ చేయండి.
ఏవైన ఫైల్‌లను ఉపయోగించడానికి గూగుల్ డిస్క్‌లను ఉపయోగించండి. ఆ ఫైల్‌లను ఆఫ్‌లైన్‌లో కూడా వినియోగించవచ్చు.
మీరు ఆఫ్‌లైన్‌లో ఏమైన మార్పులు చేస్తే తిరిగి ఆన్‌లైన్‌లోకి వెళ్లిన వెంటనే మార్పులు పూర్తవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google Assistant