KNOW REASONS AND DETAILS TO BANNED OR DELETED YOUR WHATSAPP ACCOUNT EVK
Whatsapp : వాట్సప్ ఖాతా ఎందుకు బ్లాక్ అవుతుందో తెలుసా.. చదవండి
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సప్ (Whatsapp) వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాట్సప్ 20 లక్షల ఎకౌంట్లకు పైనే బ్యాన్ చేసింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఎందుకు ఎకౌంట్ బ్లాక్ చేస్తారు. మీ ఎకౌంట్ బ్లాక్ కావొద్దంటే ఏం చేయాలో చదవండి.
ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp) వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాట్సప్ 20 లక్షల ఎకౌంట్లకు పైనే బ్యాన్ చేసింది. ఈ వాట్సప్ ఎకౌంట్లన్ని అసాంఘీక కార్యక్రమాలకు, ఇతరులకు ఇబ్బంది కలిగించేందుకు వినియోగిస్తున్నట్టు గుర్తించినట్టు వాట్సప్ పేర్కొంది. ఈ ఎకౌంట్ల ద్వారా ఇతరులకు హాని కలిగించే కంటెంట్ (Content) వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని వాట్సప్ పేర్కొంది. కేవటం ఆగస్టులోనే దాదాపు 20,70,000 వాట్సప్ ఎకౌంట్లను బ్యాన్ చేసినట్టు వాట్సప్ తెలిపింది. ఆ ఎకౌంట్లకు సంబంధించిన వారిలో 222 ఎకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకొన్నట్టు వాట్సప్ వెల్లడించింది. అయితే వాట్సప్ అకౌంట్లు ఎందుకు బ్యాన్ చేస్తారు. ఏం చేస్తే బ్యాన్ చేస్తారో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదవండి.
ఇలా చేస్తే బ్లాక్ చేస్తారు..
- వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది.
- వాట్సప్లాంటి ఇతర యాప్‌లను వాడితే థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. అదువల్లే ఆ అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
- తెలియని నంబర్లకు స్పామ్మెసేజ్లను పంపితే వాట్సాప్ ఆయా యూజర్లను బ్లాక్ చేస్తోంది.
- ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్ చేస్తోంది. రెసిపెంట్ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేస్తే మీ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతాయి.
డెలిటెడ్ ఖాతాల్లో 25శాతం ఇండియన్ ఎకౌంట్లే..
ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం ఇండియాకు చెందిన అకౌంట్లే కావడం విశేషం.. ప్రతీ నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది. జూన్ 16 నుంచి జూలై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా.. అందులో 2,011,000 అకౌంట్లను మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బ్యాన్ (Ban) చేసింది.
నవంబర్ 1 నుంచి ఆ స్మార్ట్ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్న వాట్సాప్..
యాన్యువల్ అప్‌గ్రేడ్ (Annual upgrade) పాలసీలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది వాట్సాప్ (WhatsApp). నవంబర్ (November) నుంచి కొన్ని స్మార్ట్ఫోన్లకు సపోర్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు (withdraw) ప్రకటించింది. దీంతో ఆ స్మార్ట్ఫోన్ల యూజర్లు వాట్సాప్ వాడేందుకు కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. నవంబర్ తర్వాత వాట్సాప్ రన్ చేయడానికి అనుకూలంగా లేని డివైజ్ (device)ల జాబితాను సంస్థ ఇంతకు ముందే విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system)లతో పనిచేసే వివిధ రకాల ఫోన్ మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.