హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Windows 11: విండోస్‌ 11 ఓఎస్‌తో కంప్యూటర్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? తెలుసుకోండి

Windows 11: విండోస్‌ 11 ఓఎస్‌తో కంప్యూటర్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? తెలుసుకోండి

Windows 11: విండోస్‌ 11 ఓఎస్‌తో కంప్యూటర్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? తెలుసుకోండి
(image: Windows 11)

Windows 11: విండోస్‌ 11 ఓఎస్‌తో కంప్యూటర్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? తెలుసుకోండి (image: Windows 11)

Windows 11 | విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అధికారికంగా రిలీజ్ అయింది. మరి ఈ కొత్త ఓఎస్‌తో మీ కంప్యూటర్‍ను ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోండి.

విండోస్‌ ఆధారిత కంప్యూటర్ల కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్తగా విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌( ఓఎస్‌)ను విడుదల చేసింది. కొత్త డిజైన్‌, పర్‌ఫార్మెన్స్‌ల చాలా మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. త్వరలోనే ఈ ఓఎస్‌ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. మరి ఈ కొత్త విండోస్‌లో ఉన్న ఫీచర్లేంటి, వీటితో మీ కంప్యూటర్‌ను పూర్తిగా ఎలా అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

విండోస్‌ 11లో స్టార్ట్‌ మెనూలో స్క్రీన్‌ బాటమ్‌లో సెంటర్‌కు తీసుకొచ్చారు. మ్యాక్‌ ఓఎస్‌, క్రోమ్‌ ఓఎస్‌లో ఇలానే ఉంటాయి. అయితే మీకు కావాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టార్ట్‌ మెనూను విండోస్‌ 10 మాదిరిగా లెఫ్ట్‌లోకి కూడా తీసుకురావొచ్చు.

విండోస్‌ 10లో చాలామంది ఇబ్బంది పడ్డ అంశం లైవ్‌ టైల్స్‌. స్టార్ట్‌ మెనూ ఓపెన్‌ చేయగానే... ఐకాన్లు జిఫ్‌ల తరహాలోనే ప్లే అవుతుంటాయి. అయితే కొత్త ఓఎస్‌లో ఈ ఆప్షన్‌ లేదు. రౌండెడ్‌ కార్నర్స్‌తో యాప్‌లు, సర్వీసుల ఐకాన్లు మార్చారు.

కొత్త ఓఎస్‌లో సరికొత్తగా స్నాప్‌ లేఅవుట్స్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. యాప్స్‌ లిస్ట్‌ను మీకు నచ్చినట్లు ఉండేలా చూసుకోవచ్చు. ఓఎస్‌లో అయితే డీఫాల్ట్‌గా ఆరు రకాల లేవుట్స్‌ ఇస్తున్నారు.

Google Nest Mini: ఒక్క రూపాయికే రూ.4,499 విలువైన గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... కండీషన్స్ అప్లై

Vivo V21e 5G: వివో వీ21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్

మైక్రోసాఫ్ట్‌ 365 వినియోగదారుల కోసం కొత్తగా సెర్చ్‌ డాక్యమెంట్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. అంటే సిస్టమ్‌ సెర్చ్‌లోనే డాక్యుమెంట్లను కూడా వెతకొచ్చు. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఈ తరహా ఫీచర్‌ మనం చూడొచ్చు.

మల్టిపుల్‌ మానిటర్స్‌ వాడే వారి కోసం విండోస్‌ 11 ఉపయుక్తంగా ఉంటుంది. రెండు స్క్రీన్లు కనెక్ట్‌ చేసిన తర్వాత ఏ స్క్రీన్‌లో ఏ యాప్‌ వాడాలి అనేది సులభంగా ఎంచుకోవచ్చు. స్క్రీన్‌ కంట్రోల్‌, లేఅవుట్‌ మార్పు లాంటివి కూడా సులభంగా చేసుకోవచ్చు.

విండోస్‌ కంప్యూటర్లలో అప్‌డేట్‌లు వచ్చిన ప్రతిసారి.. రీస్టార్ట్‌ అంటూ పెద్ద పనే ఉంటుంది. ఒక్కోసారి నాలుగైదు సార్లు రీస్టార్ట్‌ అవుతుంది సిస్టమ్‌. అయితే విండోస్‌11లో ఆ సమస్య ఉండదట. ఎక్కువ శాతం బ్యాగ్రౌండ్‌లోనే అప్‌డేట్లు అయిపోతాయట.

వీడియో కాలింగ్‌/కాన్ఫరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ను సిస్టమ్‌ టాస్క్‌ బార్‌ నుంచే వాడొచ్చు. దాంతోపాటు మైక్రోఫోన్‌ను సులభంగా ఒకేసారి మ్యూట్‌ చేయొచ్చు.

JioPhone Next: జియో ఆవిష్కరించిన జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ప్రీ-ఆర్డర్ సేల్... రూ.3,000 డిస్కౌంట్

బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి, సెర్చ్‌ చేయకుండానే సులభంగా కంటెంట్‌ను అందించే ఏర్పాటు విండోస్‌ 11లో ఉంది. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ సాయంతో పబ్లిషర్ల నుంచి వార్తలను విడ్జెట్‌ రూపంలో అందిస్తోంది. ఎడమవైపునకు స్వైప్‌ చేస్తూ... కొత్త కంటెంట్‌ను చదువుకోవచ్చు.

కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో టచ్‌, జెస్టర్ సపోర్టును కూడా తీసుకొస్తున్నారు. టచ్‌ ఆధారిత డివైజ్‌ల్లో ఫీచర్‌ ఉపయోగపడుతుంది. టచ్‌ పెన్స్‌, వాయిస్‌ టైపింగ్‌ లాంటివి కూడా కొత్త ఓఎస్‌ ఆకట్టుకునేలా ఉంటాయి.

ఎక్స్‌బాక్స్‌లో గేమ్స్‌ ఆడేవారికి విండోస్‌ 11 కొత్త అనుభూతినిస్తుందట. ఈ కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్‌డీఆర్‌ ఫీచర్‌ ఉంటుంది. ఇది ల్యాపీల్లో గేమింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచుతుంది. హెచ్‌డీ మోనిటర్లు ఉన్న పీసీల్లోనూ ఇది పని చేస్తుంది.

కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఆమెజాన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని కోసం అమెజాన్‌తో మైక్రోసాఫ్ట్‌తో టై అప్‌ అయ్యింది.

విండోస్‌ 11ను ఈ ఏడాది నవంబరు నుండి అందుబాటులోకి తీసుకొస్తారు. 2022 మధ్యవరకు రోల్‌ అవుట్‌ కొనసాగుతుంది. కాబట్టి యూజర్లకు అప్‌డేషన్‌కు చాలా సమయం ఉంటుంది.

విండోస్‌ 10 యూజర్లకు విండోస్‌ 11ను ఉచితంగా అప్‌డేట్‌ చేస్తారు. అయితే మీరు వాడుతున్నది జెన్యూన్‌ విండోస్‌ 10 అయి ఉండాలి. అయితే కొత్తగా విండోస్‌ 11ను ఇన్‌స్టాల్‌ చేయాలనుకునేవాళ్లు కచ్చితంగా డబ్బులు చెల్లించాలి. ధర తదితర విషయాలు త్వరలో వెల్లడిస్తారు.

విండోస్‌ 10 వాడుతున్న సిస్టమ్‌లో Settings, Update, Security, Windows Update లోకి వెళ్లాలి. ఆ తర్వాత Check for Updates అనే బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఒకవేళ అప్‌డేట్‌ మీకు వచ్చి ఉంటే Feature update to Windows 11 అని మెసేజ్‌ వస్తుంది. అప్పుడు Download and install బటన్‌ను క్లిక్‌ చేసి కొత్త ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

విండోస్‌ 11 ఓఎస్‌ ఇన్‌స్టాల్‌/అప్‌డేట్‌ చేసుకోవాలంటే సిస్టమ్‌లో ఈ కనీస ఫీచర్లు ఉండాల్సిందే. విండోస్‌ 11 ఓఎస్‌ ఉండాలంటే ఆ సిస్టమ్‌లో కనీసం 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఫ్రీ ‌ స్టోరేజీ ఉండాలి. 64 బిట్‌ సిస్టమ్ అయి ఉండాలి. 1 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ అయి ఉండాలి.

బీటా వెర్షన్‌ రూపంలో విండోస్‌ 11 ఇప్పటికే కొంతమందికి అందుబాటులో ఉంది. ఆ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వాడొచ్చు కానీ... వాడే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. అవి సిస్టమ్‌ను ఇబ్బందిపెడతాయి. కాబట్టి ఆలోచించి వాడటం మంచిది.

విండోస్‌ 7, 8.1 ఆధారిత సిస్టమ్స్‌కు కూడా విండోస్‌ 11 అందుబాటులోకి తీసుకొస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ వెర్షన్ల ఓఎస్‌లపై నిర్ణయం తీసుకుంటారో, లేక తర్వాత ఆలోచిస్తారో చూడాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Microsoft, Windows 11

ఉత్తమ కథలు