KNOW HOW WHATSAPP MULTI DEVICE FEATURE ALLOWS USERS TO USE WHATSAPP WEB WITHOUT SMARTPHONE SS
WhatsApp Web: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వాట్సప్ వెబ్ ఉపయోగించండి ఇలా
WhatsApp Web: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వాట్సప్ వెబ్ ఉపయోగించండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Tips | గతంలో స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోతే వాట్సప్ వెబ్ (WhatsApp Web) ఉపయోగించడం సాధ్యం కాదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ వెబ్ యాక్సెస్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ యూజర్లకు సరికొత్త ఫీచర్స్‌ని (WhatsApp Features) అందిస్తూనే ఉంది. ఇటీవల మల్టీ డివైజ్ ఫీచర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక యూజర్ తన వాట్సప్ అకౌంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లల్లో ఉపయోగించుకోవచ్చు. ఒక డివైజ్‌లోని ఛాటింగ్ మరో డివైజ్‌లో సింక్ అవుతుంది. ఈ మెసేజెస్, మీడియా, కాల్స్ అన్నింటికీ ఎండ్ టు ఎంట్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుంది. సాధారణంగా వాట్సప్‌ను వెబ్ వర్షన్ లేదా బ్రౌజర్లో ఉపయోగించాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టీవ్‌గా ఉండాలి. కానీ ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా మిగతా డివైజ్‌లల్లో వాట్సప్ ఉపయోగించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. మెసేజెస్ పంపొచ్చు. ఫైల్స్ కూడా షేర్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు వాట్సప్ వెబ్ ద్వారా చేసిన మెసేజెస్ సింక్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ వెబ్‌లో వాట్సప్ యాక్టీవ్‌గానే ఉంటుంది. అయితే మెయిన్ డివైజ్ 14 రోజులపాటు డిస్‌కనెక్టెడ్‌గా ఉంటే మిగతా డివైజ్‌లల్లో ఆటోమెటిక్‌గా వాట్సప్ లాగౌట్ అవుతుంది.
వాట్సప్ మల్టీ డివైజ్ ఫీచర్ వాడుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అన్ని ఫీచర్స్ ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. ఛాట్స్ డిలిట్ చేయడం లాంటి కొన్ని ఫీచర్స్ పూర్తిగా పనిచేయవు. మల్టీ డివైజ్ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో రూపొందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మరిన్ని ఫీచర్స్ రూపొందిస్తోంది వాట్సప్.
వాట్సప్‌లో స్టిక్కర్స్‌ని కాంటాక్ట్స్‌కి ఫార్వర్డ్ చేసేందుకు కొత్త షార్ట్ కట్ రూపొందిస్తోంది వాట్సప్. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తైన తర్వాత ఇతర యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేయనుంది. మీరు బీటా యూజర్ అయితే 2.21.24.11 వర్షన్ అప్డేట్ చేస్తే స్టిక్కర్స్ ఫార్వర్డ్ చేసే ఫీచర్ కనిపిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.