WhatsApp Feature: వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఇలా చెక్ చేయండి...

WhatsApp 'Checkpoint Tipline' feature | లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి భారతదేశానికి చెందిన స్టార్టప్ ‘ప్రొటో’ రూపొందించిన ఫీచర్ ఇది. అసలు ఈ ఫీచర్ ఏంటీ? ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకోండి.

news18-telugu
Updated: April 4, 2019, 5:58 PM IST
WhatsApp Feature: వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఇలా చెక్ చేయండి...
WhatsApp Feature: వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఇలా చెక్ చేయండి...
news18-telugu
Updated: April 4, 2019, 5:58 PM IST
ఫేక్‌న్యూస్... భారతదేశానికి ఓ పెద్ద సమస్యగా, సవాలుగా మారింది. దీన్ని అడ్డుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలన్నీ చర్యలు మొదలుపెట్టాయి. ఫేక్ న్యూస్ ఎక్కువగా వాట్సప్‌లోనే సర్క్యులేట్ అవుతోంది. దీంతో ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి భారతదేశానికి చెందిన స్టార్టప్ ‘ప్రొటో’ రూపొందించిన ఫీచర్ ఇది. అసలు ఈ ఫీచర్ ఏంటీ? ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకోండి.

Read this: Flash Sale: రూ.19,999 విలువైన పోకో ఎఫ్1... ఒక్క రూపాయికే

WhatsApp Checkpoint Tipline, WhatsApp Fake news, Lok Sabha Election 2019, NewsTracker, Proto, checkpoint tipline whatsapp tips, WhatsApp, fake news, fake news on social media, checkpoint tipline feature, checkpoint tipline whatsapp tips, whatsapp checkpoint tipline, what is checkpoint tipline, checkpoint tipline number, checkpoint tipline in india, how checkpoint tipline works, how to use checkpoint tipline, what is the checkpoint tipline, checkpoint tipline whatsapp number, viral fake news, వాట్సప్‌, చెక్‌పాయింట్ టిప్‌లైన్ ఫీచర్, ఫేక్ న్యూస్‌, స్టార్టప్ ప్రొటో, ఫేక్ న్యూస్ ఇండియా, నకిలీ వార్తలు, వైరల్ న్యూస్, తప్పుడు వార్తలు
ప్రతీకాత్మక చిత్రం


టిప్‌లైన్ అంటే ఏంటీ?




వాట్సప్ 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' పేరుతో కొత్త ఫీచర్ ప్రారంభించింది. మీకు వాట్సప్‌లో వచ్చిన సమాచారం నిజమైనదేనా? కాదా? అని తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. భారతదేశానికి చెందిన స్టార్టప్ PROTO రూపొందించిన ఫీచర్ ఇది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. మీకు వాట్సప్‌లో వచ్చిన వార్త లేదా సమాచారం సరైనదేనా? కాదా? అని తెలుసుకునేందుకు 'చెక్‌పాయింట్ టిప్‌లైన్' ఫీచర్ వాడుకోవచ్చు. వాట్సప్‌లో +919643000888 నెంబర్‌‌కు మీకు వచ్చిన మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయాలి.
టిప్‌లైన్‌లో మీరు షేర్ చేసిన మెసేజ్ ప్రోటో వెరిఫికేషన్ సెంటర్‌కు వెళ్తుంది. ఆ మెసేజ్‌ను ప్రోటో టీమ్ వెరిఫై చేస్తుంది. మీకు వచ్చిన మెసేజ్ నిజమా, అబద్ధమా, తప్పుడు ప్రచారమా, తప్పుడు సమాచారమా అన్న విషయం మీకు తెలుస్తుంది.

WhatsApp Checkpoint Tipline, WhatsApp Fake news, Lok Sabha Election 2019, NewsTracker, Proto, checkpoint tipline whatsapp tips, WhatsApp, fake news, fake news on social media, checkpoint tipline feature, checkpoint tipline whatsapp tips, whatsapp checkpoint tipline, what is checkpoint tipline, checkpoint tipline number, checkpoint tipline in india, how checkpoint tipline works, how to use checkpoint tipline, what is the checkpoint tipline, checkpoint tipline whatsapp number, viral fake news, వాట్సప్‌, చెక్‌పాయింట్ టిప్‌లైన్ ఫీచర్, ఫేక్ న్యూస్‌, స్టార్టప్ ప్రొటో, ఫేక్ న్యూస్ ఇండియా, నకిలీ వార్తలు, వైరల్ న్యూస్, తప్పుడు వార్తలు

ఎలాంటి సందేశాలు వెరిఫై చేయొచ్చు?


మీకు టెక్స్ట్ రూపంలో వచ్చే మెసేజ్ లేదా ఫోటోలు, వీడియోలు, వీడియో లింకులు ఏవైనా మీరు టిప్‌లైన్‌కు షేర్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాళీ, మళయాళం భాషల్లో సేవలు లభిస్తాయి. తప్పుడు వార్తల్ని అరికట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సంస్థల సాయం తీసుకుంటోంది ప్రోటో.

గతంలోనే ఫేక్ న్యూస్‌కు చెక్ చెప్పేందుకు 'Search image' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? అని తెలుసుకోవచ్చు.

BJP vs Congress: బీజేపీ, కాంగ్రెస్ మధ్య 'చీరల యుద్ధం'

ఇవి కూడా చదవండి:

TikTok Ban: టిక్‌టాక్ యూజర్లకు షాక్... యాప్‌ను బ్యాన్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు

IRCTC E-Ticket: స్లీపర్ క్లాస్ టికెట్‌తో థర్డ్ ఏసీలో ఉచితంగా ప్రయాణం... ఆటో అప్‌గ్రేడేషన్‌తో ఎన్నో లాభాలు

 
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...