Facebook Messenger: ఫేస్‌బుక్‌లో సీక్రెట్ ఛాటింగ్‌ గురించి మీకు తెలుసా?

Facebook Secret Conversation Feature | మీరు సీక్రెట్ కాన్వర్జేషన్‌లో మెసేజెస్‌తో పాటు ఫోటోలు, స్టిక్కర్స్, వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్ పంపొచ్చు. గ్రూప్ మెసేజెస్, గిఫ్ ఫైల్స్, వాయిస్ లేదా వీడియో కాలింగ్, పేమెంట్స్ సాధ్యం కావు.

news18-telugu
Updated: March 9, 2019, 10:25 AM IST
Facebook Messenger: ఫేస్‌బుక్‌లో సీక్రెట్ ఛాటింగ్‌ గురించి మీకు తెలుసా?
Facebook Messenger: ఫేస్‌బుక్‌లో సీక్రెట్ ఛాటింగ్‌ గురించి మీకు తెలుసా?
  • Share this:
వాట్సప్‌ ఛాటింగ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని అందరికీ తెలిసిందే. అంటే మనం ఎవరికైనా మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ వాళ్లు తప్ప ఇంకెవరూ చదవలేరు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కూడా అలాంటి ఫీచరే ఉంది. మీరు ఎవరితోనైనా రహస్యంగా ఛాటింగ్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్‌లు ఎక్కువ సేపు ఉండవు. వెంటనే డిలిట్ అయిపోతాయి. దీన్నే సీక్రెట్ కాన్వర్జేషన్ అంటారు. మరి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో సీక్రెట్ కాన్వర్జేషన్ ఎలా ఉపయోగించుకోవాలి? దాంతో సీక్రెట్ ఛాటింగ్ ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోండి.

Secret Conversation feature, Facebook Secret Conversation, Secret Chatting feature, Facebook Secret Chatting, Facebook end-to-end encryption, Facebook new features, Facebook features, ఫేస్‌బుక్ సీక్రెట్ కాన్వర్జేషన్ ఫీచర్, ఫేస్‌బుక్ సీక్రెట్ ఛాటింగ్, ఫేస్‌బుక్ ఫీచర్స్
ప్రతీకాత్మక చిత్రం


Read this: Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి

సీక్రెట్ కాన్వర్జేషన్ ఎలా చేయాలి?


మీరు ముందుగా మీ మెసెంజర్ యాప్ ఓపెన్ చేయాలి. మీరు ఎవరితో అయితే రహస్యంగా ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి పేరుపై క్లిక్ చేసి ఛాట్ విండో ఓపెన్ చేయాలి. ఆ ఛాట్ విండోలో టాప్ రైట్‌లో ఇన్ఫో ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ క్లిక్ చేయాలి. అందులో 'Go to Secret Conversation' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సీక్రెట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన టైమ్‌ని బట్టి మెసేజెస్ డిలిట్ అవుతాయి.

Read this: 2019 Smartphones: రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

Secret Conversation feature, Facebook Secret Conversation, Secret Chatting feature, Facebook Secret Chatting, Facebook end-to-end encryption, Facebook new features, Facebook features, ఫేస్‌బుక్ సీక్రెట్ కాన్వర్జేషన్ ఫీచర్, ఫేస్‌బుక్ సీక్రెట్ ఛాటింగ్, ఫేస్‌బుక్ ఫీచర్స్
ప్రతీకాత్మక చిత్రం

సీక్రెట్ కాన్వర్జేషన్‌లో ఏమేం చేయొచ్చు?


మీరు సీక్రెట్ కాన్వర్జేషన్‌లో మెసేజెస్‌తో పాటు ఫోటోలు, స్టిక్కర్స్, వీడియోస్, వాయిస్ రికార్డింగ్స్ పంపొచ్చు. గ్రూప్ మెసేజెస్, గిఫ్ ఫైల్స్, వాయిస్ లేదా వీడియో కాలింగ్, పేమెంట్స్ సాధ్యం కావు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కాబట్టి మెసేజెస్, ఫోటోలు, వీడియోలు మాత్రమే పంపుకోవచ్చు. అయితే మీరు సీక్రెట్‌గా ఛాటింగ్ చేసినా అవతలి వ్యక్తి స్క్రీన్‌షాట్‌తో మెసేజెస్ షేర్ చేసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. సీక్రెట్ ఛాటింగ్ కదా అని అభ్యంతరకరమైన మెసేజెస్ పంపితే ఫేస్‌బుక్ మీపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వేధించడానికి, బెదిరించడానికి సీక్రెట్ ఛాటింగ్ ఉపయోగించుకుంటే ఇబ్బందుల్లో పడకతప్పదు. అవతలి వ్యక్తి కంప్లైంట్ చేస్తే మీ మెసేజెస్ డీక్రిప్ట్ చేసే అవకాశం ఉంటుంది.

Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు


ఇవి కూడా చదవండి:

IRCTC: ఇక ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్ చార్టులు... ఖాళీ బెర్తులు మీరే చూసుకోవచ్చు

Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...
First published: March 9, 2019, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading