హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? మరి ఈ సెట్టింగ్స్ మార్చారా?

WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? మరి ఈ సెట్టింగ్స్ మార్చారా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | మీరు ఈ మధ్య వాట్సప్ డౌన్‌లోడ్ (WhatsApp Download) చేశారా? కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేశారా? మరి మీ వాట్సప్‌లో ఈ మార్పులు చేశారా?

వాట్సప్... పరిచయం అక్కర్లేని మెసెంజర్ యాప్. వాట్సప్ మొదట ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా పరిచయమైంది. ఒక రూపాయికి ఒక ఎస్ఎంఎస్ పంపే సమయంలో వాట్సప్ బాగా పాపులర్ అయింది. ఇలా మెసేజ్ పంపగానే అవతలివారికి వెంటనే వెళ్లిపోయేది. అలాంటి వాట్సప్‌లో ఇప్పుడు ఎన్నో ఫీచర్స్ (WhatsApp Features) వచ్చేశాయి. ఫోటోలు పంపొచ్చు, వీడియోలు షేర్ చేయొచ్చు. స్టేటస్ పెట్టొచ్చు. వాయిస్ కాల్స్ చేయొచ్చు. వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్‌ని అందిస్తోంది వాట్సప్. మరిన్ని ఫీచర్స్‌ని వాట్సప్ టెస్ట్ చేస్తోంది. వాటిని ముందు బీటా యూజర్లకు, ఆ తర్వాత యూజర్లందరికీ రిలీజ్ చేస్తుంది వాట్సప్.

వాట్సప్ డౌన్‌లోడ్ (WhatsApp Download) చేసిన తర్వాత డిఫాల్ట్‌గా ఉండే సెట్టింగ్స్‌తో యాప్ ఉపయోగించడం చాలామందికి అలవాటు. కానీ వాట్సప్ ప్రొఫైల్, ఫోటో లాంటివి ఎన్నో మార్చొచ్చు. వాట్సప్ ప్రొఫైల్ ఫోటోను డీపీ అంటే డిస్‌ప్లే పిక్చర్ లేదా డిస్‌ప్లే ఫోటో అని కూడా అంటారు. మరి వాట్సప్ ఫోటో ఎలా మార్చాలో తెలుసుకోండి.

JioPhone Next: రేపటి నుంచి జియోఫోన్ నెక్స్‌ట్ సేల్... ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? ఈఎంఐ ఎంత? తెలుసుకోండి

వాట్సప్‌లో ఫోటో మార్చండి ఇలా...


ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి.

త్రీ డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేసి ఫోటో సెట్ చేయొచ్చు.

కెమెరా ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత కెమెరా రోల్ లేదా టేక్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది.

అప్పటికప్పుడు ఫోటో క్లిక్ చేసి లేటెస్ట్ ఫోటో ప్రొఫైల్ ఫోటోగా పెట్టొచ్చు.

లేదా గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి గతంలో తీసిన ఫోటోను అప్‌డేట్ చేయొచ్చు.

నేమ్ అని ఉన్న దగ్గర పేరు పెట్టుకోవచ్చు.

Nokia T20: ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా టీ20 ట్యాబ్లెట్ సేల్... ధర ఎంతంటే

వాట్సప్‌లో ఫోటో ఎలా తొలగించాలంటే...


ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి.

త్రీ డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

ఫోటో పైన క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Remove Photo పైన క్లిక్ చేస్తే ఫోటో డిలిట్ అవుతుంది.

Redmi Note 11 Series: గంటలో 5 లక్షలకు పైగా రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు

వాట్స్‌లో ఎబౌట్ సెక్షన్ ఎలా అప్‌డేట్ చేయాలంటే...


ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి.

త్రీ డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

About పైన క్లిక్ చేయాలి.

Available, Busy లాంటి 11 రికమండేషన్స్ అందిస్తోంది వాట్సప్.

వీటిని ఉపయోగించుకోవచ్చు.

లేదా మీరు సొంతగా ఎబౌట్ సెక్షన్‌లో మీకు నచ్చిన క్యాప్షన్ పెట్టొచ్చు.

మొత్తం 139 క్యారెక్టర్స్‌తో ఎబౌట్ సెక్షన్ అప్‌డేట్ చేయొచ్చు.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు