లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఎప్పుడూ వివాదాస్పదమే. కారణం ప్రైవసీకి విఘాతం కలుగుతుందన్న వాదనే. అయితే లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌తో అమ్మాయిలకు సెక్యూరిటీ కూడా పెరుగుతుందన్న వాదన ఉంది. అందుకే భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు తమ లొకేషన్ ట్రాక్ చేసేందుకు పర్మిషన్ ఒకరికొకరు ఇస్తుంటారు. లేదా అవసరమైనప్పుడు లొకేషన్ షేర్ చేస్తుంటారు. అనుకోని ప్రమాదంలో ఉన్నా, లేదా కొత్త రూట్లో వెళ్లినా లొకేషన్ షేరింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ క్షణంలో ఎక్కడ ఉన్నామో లొకేషన్ షేర్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లభిస్తుంది. మరి మీ లొకేషన్ షేర్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైనవి నాలుగు. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఎస్ఎంఎస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ లొకేషన్‌ను ఇతరులకు ఈజీగా షేర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
1. వాట్సప్‌లో లొకేషన్ షేరింగ్
వాట్సప్‌లో లొకేషన్ షేర్ చేయడం చాలా ఈజీ. ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. మీరు ఎవరికి లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. మెసేజ్ టైప్ చేసే బాక్స్‌లో కనిపించే అటాచ్మెంట్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో గ్యాలరీ, ఆడియో, కాంటాక్ట్‌తో పాటు లొకేషన్ ఐకాన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లొకేషన్ షేర్ చేయొచ్చు. మీ లొకేషన్ని ఎంత సేపు షేర్ చేయాలో కూడా ఆ సమయాన్ని మీరే నిర్ణయించొచ్చు. 15 నిమిషాలు, 1 గంట, 8 గంటలు అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. మీరు లొకేషన్ షేర్ చేసిన తర్వాత షేరింగ్ ఆపాలంటే Stop Sharing పైన క్లిక్ చేస్తే చాలు.
2. ఫేస్బుక్ మెసెంజర్లో లొకేషన్ షేరింగ్
ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేస్తే మెసేజ్ బాక్స్‌లో కుడివైపు జీపీఎస్ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది. లొకేషన్‌ను ఆన్ చేసిన తర్వాత మీరు ఏ మెసేజ్ పంపినా లొకేషన్ మెసేజ్ కూడా వెళ్తుంది.
3. ఎస్ఎంఎస్లో లొకేషన్ షేరింగ్
మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ లొకేషన్ షేర్ చేయొచ్చు. వాట్సప్‌లో చేసినట్టుగానే స్టెప్స్ ఉంటాయి. ముందు అటాచ్మెంట్ ఐకాన్ పైన క్లిక్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేయాలి. ఎస్ఎంఎస్లో గూగుల్ మ్యాప్స్ ఐడీ వెళ్తుంది. ఆ ఐడీ క్లిక్ చేస్తే మీ లొకేషన్ కనిపిస్తుంది.
4. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ షేరింగ్
ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ కార్నర్లో ఆప్షన్స్ ఓపెన్ చేసి లొకేషన్ షేరింగ్ క్లిక్ చేయండి. యాడ్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎవరికి లొకేషన్ షేర్ చేయాలో క్లిక్ చేయండి. మీరు అవతలివారి జీమెయిల్, వాట్సప్, జీమెయిల్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా మీ లొకేషన్ షేర్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్‌ను 1 గంట లేదా మీరు ఆఫ్ చేసే వరకు షేర్ చేయొచ్చు.
మీరు మీ లొకేషన్ షేర్ చేయాలంటే మీ ఫోన్లో లొకేషన్ ఆన్‌లో ఉండాలి. లొకేషన్ షేర్ చేయడానికి Find My Friends, Life360, Family Locator, Glympse లాంటి యాప్స్ కూడా ఉన్నాయి.
Realme X: రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ...
WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్లోడ్ చేయండి ఇలా...
IRCTC-Aadhaar Link: ఐఆర్సీటీసీతో ఆధార్ లింక్ చేయండి... ఈ లాభాలు పొందండి