మీరు వాట్సప్‌లో ఎక్కువగా ఛాటింగ్ చేస్తుంటారా? ఎక్కువగా వాట్సప్ మెసేజెస్ పంపిస్తుంటారా? వాట్సప్‌లో మీరు ప్రతీ మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. టైప్ చేయకుండా మెసేజ్ పంపొచ్చు. ఇందుకోసం డిజిటల్ అసిస్టెంట్‌ను ఉపయోగించుకుంటే చాలు. మీరు పంపాల్సిన మెసేజ్ డిజిటల్ అసిస్టెంట్ మెసేజ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ను, యాపిల్ ఐఫోన్ యూజర్లు సిరిని ఉపయోగించుకొని వాట్సప్ మెసేజెస్ టైప్ చేయకుండా పంపొచ్చు. వాట్సప్ మెసేజెస్ పంపడం మాత్రమే కాదు... వాట్సప్‌లో వచ్చిన మెసేజెస్ చదివి వినిపించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు. ఫోన్లో నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి టైప్ చేయకుండా వాట్సప్‌లో మెసేజెస్ ఎలా పంపాలో తెలుసుకోండి.
Yono SBI App: ఎస్బీఐ యోనో లైట్ యాప్‌లో లభించే బ్యాంకింగ్ సేవలు ఇవే
Samsung Galaxy M51: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... రూ.4,750 తగ్గింపు పొందండి ఇలా
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత Hey Google లేదా Okay Google అని కమాండ్ ఇవ్వండి. లేదా స్మార్ట్‌ఫోన్‌లో హోమ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసినా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత Send a WhatsApp message అని చెప్పాలి. ఎవరికి మెసేజ్ చేయాలో కూడా పేరు చెప్పాలి. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఆ ఫోన్ నెంబర్‌కు ఏ పేరు ఫీడ్ చేశారో అదే పేరు చెప్పాల్సి ఉంటుంది. అ తర్వాత అందులో ఏ మెసేజ్ పంపాలని గూగుల్ అసిస్టెంట్ అడుగుతుంది. ఆ తర్వాత మీరు టైప్ చేయాల్సిన మెసేజ్ చెప్పాలి. ఆటోమెటిక్‌గా మెసేజ్ టైప్ అవుతుంది. మెసేజ్ పంపడానికి రెడీగా ఉన్నట్టు గూగుల్ అసిస్టెంట్ చెబుతుంది. మీరు Okay, send it అంటే చాలు మెసేజ్ వెళ్లిపోతుంది.
Nokia G20: ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ.10,000 లోపే... ఆఫర్ రెండు రోజులే
Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్
యాపిల్ ఐఫోన్ యూజర్లు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ అసిస్టెంట్‌ను, యాపిల్ యూజర్లు సిరిని ఉపయోగించాలి. అయితే మీరు సీక్రెట్‌గా మెసేజెస్ పంపాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ ఉపయోగపడదు. మీ చుట్టూ ఎవరన్నా ఉన్నప్పుడు మీరు మెసేజ్ టైప్ చేయకుండా ఇలా గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించుకుంటే మీరు ఏ మెసేజ్ పంపారో, ఎవరికి పంపారు చుట్టూ ఉన్నవారికి తెలుస్తుంది. దీని వల్ల మీ ప్రైవసీకే ఇబ్బంది. ఎవరూ లేనప్పుడు ఈ ఫీచర్ ఉపయోగించుకుంటే మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Google Assistant, Ios, Whatsapp, Whatsapp tricks