Facebook: మీ ఫేస్‌బుక్ వేరేవాళ్లు లాగిన్ చేశారా..? ఇలా తెలుసుకోవచ్చు

Facebook Log out of all sessions | మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో ఎలా తెలుసుకోవడం? ఇది చాలా సింపుల్. మీ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఫేస్‌బుక్. అంతే కాదు... ఎప్పుడెప్పుడు మీ అకౌంట్ యాక్టీవ్‌లో ఉందో కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

news18-telugu
Updated: March 16, 2019, 9:06 AM IST
Facebook: మీ ఫేస్‌బుక్ వేరేవాళ్లు లాగిన్ చేశారా..? ఇలా తెలుసుకోవచ్చు
Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా
news18-telugu
Updated: March 16, 2019, 9:06 AM IST
ఫేస్‌బుక్... అందరికీ తెలిసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు ఫేస్‌బుక్ వేదికగా మారిపోయింది. అయితే ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవాళ్లు తమ ఫోన్‌తో పాటు ఇంట్లో ల్యాప్‌టాప్‌లో, ఆఫీసులో లేదా ఎక్కడైనా కంప్యూటర్‌లో లాగిన్ చేస్తుంటారు. చాలాసార్లు లాగౌట్ చేయడం మర్చిపోతుంటారు. లాగౌట్ చేయలేదన్న విషయం కూడా గుర్తుండదు. చివరకు ఆ పరిస్థితే చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ లాగిన్ చేసి ఉంటే ఇబ్బంది ఉండదు కానీ... ఎక్కడైనా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో లాగిన్ చేసి ఉంటే మాత్రం మీ అకౌంట్ మిస్‌యూజ్ అయ్యే, హ్యాకయ్యే అవకాశాలు ఎక్కువ. మరి మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో ఎలా తెలుసుకోవడం? ఇది చాలా సింపుల్. మీ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ఫేస్‌బుక్. అంతే కాదు... ఎప్పుడెప్పుడు మీ అకౌంట్ యాక్టీవ్‌లో ఉందో కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Read this: RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి

facebook logout, facebook logout problem, logout facebook account, facebook logout login, facebook logout automatically, facebook account, Log out of all sessions, how to see other devices logged into your facebook account, where are you logged in facebook, how to check where my facebook account are logged in, facebook where you're logged in wrong, facebook login history, ఫేస్‌బుక్ లాగిన్, ఫేస్‌బుక్ లాగౌట్, ఫేస్‌బుక్ లాగిన్ హిస్టరీ
ప్రతీకాత్మక చిత్రం


మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ వివరాలు ఇలా తెలుసుకోండి




ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవండి.
సెట్టింగ్స్ పేజీ ఓపెన్ చేయండి.
లెఫ్ట్ సైడ్ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో 'Security and login' క్లిక్ చేయండి.
Loading...
మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో 'Where You're logged In' ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో డౌన్ యారో క్లిక్ చేస్తే మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఏ డివైజ్‌లల్లో వాడారో తెలుసుకోవచ్చు.
మీకు ఏదైనా అనుమానం వస్తే 'Log out of all sessions' క్లిక్ చేయండి.
మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌లో ఉన్న డివైజ్‌ల నుంచి లాగౌట్ అవుతుంది.
ఇంకా ఏదైనా అనుమానంగా ఉంటే పాస్‌వర్డ్ మార్చేయండి.

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ దగ్గర రెండో పాన్ కార్డ్ ఉందా? ఇలా సరెండర్ చేయండి

GB WhatsApp: మీ జీబీ వాట్సప్ బ్లాక్ అయిందా? ఇలా చేయండి
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...