Home /News /technology /

Whatsapp: వాట్సాప్‌లో అనుకున్న టైమ్‌కు మెసేజ్ పంపే ఫీచర్ ఉపయోగించాలనుకుంటున్నారా? చాలా సింపుల్.. ఇలా చేయండి

Whatsapp: వాట్సాప్‌లో అనుకున్న టైమ్‌కు మెసేజ్ పంపే ఫీచర్ ఉపయోగించాలనుకుంటున్నారా? చాలా సింపుల్.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

థర్డ్ పార్టీ అప్లికేషన్లు ఉపయోగించడం ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు వాట్సాప్‌‌లో మెసేజ్ షెడ్యూల్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఒక చిన్న ట్రిక్‌తో వాట్సాప్‌‌ యాప్‌లో కూడా సింపుల్‌గా మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
వాట్సాప్‌‌లో మెసేజ్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నారా? అది ఎలాగో తెలియక సతమతమవుతున్నారు? అయితే ఈ న్యూస్ మీకోసమే. సాధారణంగా బర్త్‌డే విషెస్, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ సమాచారం నిర్దిష్ట సమయానికి అవతల వ్యక్తికి అందేలా మెసేజ్ షెడ్యూల్ చేయాలని అనుకుంటారు చాలా మంది. కానీ వాట్సాప్‌‌లో షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ లేదని తెలిసి నిరాశ పడిపోతుంటారు. థర్డ్ పార్టీ అప్లికేషన్లు ఉపయోగించడం ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు వాట్సాప్‌‌లో మెసేజ్ షెడ్యూల్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఒక చిన్న ట్రిక్‌తో వాట్సాప్‌‌ యాప్‌లో కూడా సింపుల్‌గా మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

బిజినెస్ అకౌంట్స్ కోసం వాట్సాప్ "Using Away Messages" ఫీచర్‌ను అందిస్తోంది. మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా ఆఫీసు బయట ఉన్నప్పుడు ఉపయోగించగల ఫంక్షన్ ఇది. ఈ ఫీచర్ వినియోగించి ఆటోమేటిక్‌గా అన్ని కాంట్రాక్ట్స్ కు లేదా నచ్చిన కాంటాక్ట్స్ కు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే మెసేజెస్ పంపించవచ్చు. అది ఎలాగో చూద్దాం.

వాట్సాప్‌‌లో away messages ఫీచర్‌ను సెట్ చేయండిలా

స్టెప్ 1: వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ లో మోర్ ఆప్షన్స్ > బిజినెస్ టూల్స్ > ఎవే మెసేజ్ పై క్లిక్ చేయండి

స్టెప్ 2: 'సెండ్ ఎవే మెసేజ్' ఆప్షన్ టర్న్ ఆన్ చేయండి.

స్టెప్ 3: మెసేజ్ పై క్లిక్ చేసి > ఓకే పై నొక్కండి.

స్టెప్ 4: షెడ్యూల్ కింద కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

- ఎప్పుడూ కూడా ఆటోమేటిక్‌గా మెసేజ్ పంపాలనుకుంటే ఆల్వేస్ సెండ్ (Always Send) ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

- నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఆటోమేటిక్‌గా మెసేజ్ పంపడానికి కస్టమ్ షెడ్యూల్ ఆప్షన్ సెలక్ట్ చేయండి.

- పని వేళల తరువాత కూడా ఆటోమేటెడ్ మెసేజ్ పంపవచ్చు. అందుకు అనుగుణంగా సమయం సెట్ చేసుకుంటే సరిపోతుంది.

స్టెప్ 5: రెసిపీయంట్(Recipient) సెక్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత కింది ఆప్షన్లలో ఒకటి ఎంచుకోండి.

- పని వేళల తర్వాత మీకు మెసేజ్ పంపే ఎవరికైనా ఆటోమేటెడ్ మెసేజ్ పంపడానికి 'ఎవ్రీవన్' ఆప్షన్ సెలక్ట్ చేయండి.

- మీ డ్రెస్ బుక్ లో లేని నంబర్‌లకు ఆటోమేటెడ్ మెసేజ్ పంపడానికి 'ఎవ్రీవన్ నాట్ ఇన్ ద అడ్రస్ బుక్' ఆప్షన్ సెలక్ట్ చేయండి.

- ఎంపిక చేసిన కొన్ని నంబర్‌లకు మినహా అన్ని నంబర్‌లకు ఆటోమేటెడ్ మెసేజ్ పంపడానికి 'ఎవ్రీవన్ ఎక్సెప్ట్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- ఓన్లీ సెండ్ ఆప్షన్ పై నొక్కి కేవలం ఒకే ఒక్క కాంటాక్ట్ కి కూడా ఆటోమేటెడ్ మెసేజ్ పంపించవచ్చు.

స్టెప్ 6: సేవ్ బటన్‌పై నొక్కండి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు