వాట్సప్... ఎవరికైనా క్షణాల్లో మెసేజ్ పంపగల ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్. కేవలం మొబైల్ డేటా ఉంటే చాలు. క్షణాల్లో మెసేజ్, ఫోటోస్, వీడియోస్ పంపొచ్చు. ఈ సర్వీస్ బాగానే ఉంది కానీ... రోజూ వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో ఫోన్‌లో ఉండే స్పేస్ నిండిపోతుంటుంది. వాట్సప్ గ్రూప్స్‌లో ఉంటే ఫోటోలు, వీడియోల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. డౌన్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలతో ఫోన్‌లో స్పేస్ నిండిపోవడం అందరికీ ఉండే సమస్యే. అందులో ఉపయోగపడే ఫోటోలు, వీడియోలు తక్కువగానే ఉంటాయి. ఇక అప్పటివరకు డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్‌ని డిలిట్ చేయడం ఓ పెద్ద పనే. మరి మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? వాట్సప్ ఫోటోలు, వీడియోలతో ఫోన్‌లో స్పేస్ నిండిపోతుందా? మరి స్టోరేజ్ ఎలా సేవ్ చేయాలో తెలుసుకోండి.
వాట్సప్‌లో ఫైల్స్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా... మీకు అవసరమైన ఫైల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముంటుంది. ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.
'Data and storage usage' పైన క్లిక్ చేయండి.
'Media auto-download' ఆప్షన్ కనిపిస్తుంది.
అందులో కనిపించే మూడు ఆప్షన్స్‌లో NO ఎంచుకోండి.
ఈ సెట్టింగ్స్ మారిస్తే ఫైల్స్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ కావు. మీకు కావాల్సిన ఫైల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల మొబైల్ డేటా ఆదా కావడం మాత్రమే కాకుండా... వచ్చిన ప్రతీ ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఫోన్‌ను నింపాల్సిన పరిస్థితి ఉండదు.
డిఫాల్ట్ సెట్టింగ్స్ కారణంగా వాట్సప్ ఫైల్స్ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే వాట్సప్ ఫోటోలు, వీడియోలే కనిపిస్తుంటాయి.
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోండి.
లిస్ట్‌లో కనిపించే 'Chats' పైన క్లిక్ చేయండి.
Media Visibility ఆప్షన్ ఆన్‌లో కనిపిస్తుంది.
Media Visibility ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.
Media Visibility ఆప్షన్ ఆఫ్ చేస్తే డౌన్‌లోడ్ చేసే ఫైల్స్ గ్యాలరీలోకి వెళ్లవు. మీరు వాట్సప్‌లోనే చూసుకోవచ్చు. అక్కడే డిలిట్ చేయొచ్చు. లేదా ఫైల్ మేనేజర్ యాప్ ద్వారా ఫైల్స్ చూడొచ్చు.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
ఇవి కూడా చదవండి:
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Smartphone, Whatsapp