ఇటీవల వాట్సప్ ప్రైవసీ విషయంలో పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదంలో ఎక్కువగా వినిపించిన మాట ప్రైవసీ గురించే. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందువల్ల యూజర్ల మెసేజెస్ ఇతరులు చదవలేరని, ఫోటోలు, వీడియోలు చూడలేరని వాట్సప్ చెబుతూ వస్తోంది. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందువల్ల ఎక్కువ మంది వాట్సప్ ద్వారానే ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటారు. ఛాట్ చేస్తారు. వాట్సప్ కాల్స్ చేస్తారు. వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడం సాధ్యం కాదు. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే వాట్సప్ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఇదేమీ పెద్ద సీక్రెట్ కూడా కాదు. వాట్సప్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేదన్న కారణంతో మోసగాళ్లు, అమ్మాయిలను వేధించేవాళ్లు వాట్సప్ ద్వారా కాల్స్ చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడం ద్వారా వారికి చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. మరి వాట్సప్ కాల్స్ ఎలా రికార్డ్ చేయొచ్చో తెలుసుకోండి.
WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... ఇలా మార్చేయండి
WhatsApp: వాట్సప్ వద్దా? అయితే 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు
ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తే చాలు. ప్లేస్టోర్‌లో రికార్డింగ్ యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది. రికార్డింగ్ ఆన్ చేస్తే వాట్సప్ కాల్స్ కూడా రికార్డ్ అవుతాయి. ఫోన్లో స్టోర్ అవుతాయి. అయితే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేముందు జాగ్రత్త. ప్లేస్టోర్‌లో ఉపయోగపడే యాప్స్‌తో పాటు యూజర్లకు చిక్కులు తెచ్చే యాప్స్ కూడా ఉంటాయి. యూజర్ల డేటాను కాజేసే యాప్స్ ప్లేస్టోర్‌లో వేలల్లో ఉన్నాయి. అందుకే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసేముందు ఓసారి రేటింగ్స్, రివ్యూస్ చదవడం మంచిది.
WhatsApp Trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడటం ఎలాగో తెలుసా?
WhatsApp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇలా వాడుకోవచ్చు
ఇక ఐఓఎస్ యూజర్లు వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్ బుక్కి కనెక్ట్ చేసి క్విక్ టైమ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఆడియో రికార్డ్ అవుతుంది. వాట్సప్ కాల్ చేసేముందు క్విక్ టైమ్‌లో రికార్డ్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా చిన్నచిన్న టెక్నిక్స్ ద్వారా వాట్సప్ కాల్స్ రికార్డ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:January 23, 2021, 13:41 IST