Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా? ఈ యాప్స్‌తో ఈజీగా బిల్ చెల్లించండి ఇలా

Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా? ఈ యాప్స్‌తో ఈజీగా బిల్ చెల్లించండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Electricity Bill Payment | మీరు ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లించాలా? ఇందుకోసం ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే బిల్ చెల్లించొచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ (UPI Apps) ద్వారా కరెంట్ బిల్ ఎలా చెల్లించాలో తెలుసుకోండి.

  • Share this:
ప్రస్తుత టెక్​ యుగంలో డిజిటల్​ చెల్లింపుల హవా కొనసాగుతోంది. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన (Bill Payment) అవసరం లేకుండా.. ఇంట్లోనే కాళ్లు కదపకుండా పనులన్నీ పూర్తి చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అందుకే డిజిటల్​ చెల్లింపు (Digital Payments) ప్లాట్​ఫామ్​లకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​పే, భీమ్​ వంటి యాప్స్​ ఈ డిజిటల్​ చెల్లింపులకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్​ బిల్లు చెల్లింపు, డీటీహెచ్​ రీచార్జ్​, మొబైల్​ రీచార్జ్​, గ్యాస్ బుకింగ్​​, మెట్రో కార్డ్ రీఛార్జ్‌లతో పాటు అనే సర్వీసులను అందిస్తున్నాయి. మీ నెలవారీ విద్యుత్​ బిల్లును BHIM, పేటీఎం, ఫోన్​పే ఉపయోగించి ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.

భీమ్


ముందుగా మీ ఫోన్​లో BHIM యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్​ చేయండి. దీంతో, కేవలం రెండు నిమిషాల్లోనే మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. BHIM యాప్‌లోని స్క్రీన్ మధ్యలో ఉన్న "పే బిల్స్​"​పై క్లిక్​ చేయండి. దానిలోని ‘ఎలక్ట్రిసిటీ బిల్​’ ఆప్షన్​ను ఎంచుకోండి. తరువాత, మీ రాష్ట్ర పరిధిలోని విద్యుత్​ డిస్ట్రిబ్యూటర్​ను ఎంచుకోండి. ఇన్‌పుట్ బాక్స్​లో మీ యూజర్ ఐడీని ఎంటర్​ చేయండి. దీంతో అక్కడ మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​ అమౌంట్​ చూపిస్తుంది. మీ యూపీఐ పిన్​తో బిల్​ పేమెంట్​ పూర్తి చేయండి. వెంటనే మీ బిల్​ పేమెంట్​ పూర్తయినట్లు మీ మొబైల్​కు మెసేజ్​ వస్తుంది.

Nokia XR20: నీళ్లల్లో ముంచినా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏమీ కాదు... రేపటి నుంచి నోకియా ఎక్స్ఆర్20 ప్రీ-ఆర్డర్

పేటీఎం


పేటీఎం యాప్​ ద్వారా కూడా సులభంగా మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. ముందుగా పేటీఎం యాప్‌ని ఓపెన్​ చేసి యాప్ హోమ్‌పేజీలో రీఛార్జ్, బిల్ పేమెంట్​ విభాగంలోకి వెళ్లండి. ఆ తర్వాత "ఎలక్ట్రిసిటీ బిల్" ఆప్షన్​పై క్లిక్​ చేయండి. మీ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ బోర్డ్​ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ యూజర్​ ఐడీని ఎంటర్​ చేసి కంటిన్యూపై నొక్కండి. బ్యాలెన్స్​ బిల్​ అమౌంట్​ చూపిస్తుంది. మీ యూపీఐ ఐడీతో పేమెంట్​ పూర్తి చేయండి.

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

ఫోన్​ పే


ఫోన్​ పే యూజర్లు ముందుగా తమ యాప్​ ఓపెన్​ చేసి "రీఛార్జ్ అండ్​ బిల్​ పేమెంట్​" ఆప్షన్​పై క్లిక్​ చేయండి. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్​ ఆప్షన్​ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ బిల్లర్ పేరును టాప్ సెర్చ్ బార్‌లో ఎంటర్​ చేయండి. తర్వాత మీ కన్స్యూమర్ ఐడీని టైప్ చేసి, కన్ఫర్మ్ నొక్కండి. మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్​ మొత్తం చూపిస్తుంది. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి, పేమెంట్​ పూర్తి చేయండి.

Realme GT Neo 2: రూ.31,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

గూగుల్​ పే


ఇతర యూపీఐ యాప్స్ లాగే గూగుల్ పేలో సైతం ఎలక్ట్రిసిటీ బిల్​ పే చేయవచ్చు. హోమ్​ స్క్రీన్​పై కనిపించే ఎలక్ట్రిసిటీ బిల్​ పేమెంట్​పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్​ను ఎంచుకొని కన్స్యూమర్​ నెంబర్​ ఎంటర్​ చేయండి. మీ యూపీఐ ఐడీ ఉపయోగించి బ్యాలెన్స్ అమౌంట్​ను చెల్లించండి. పై అన్ని యాప్స్​లో ఆటో పే ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: