LIC: పేటీఎం యాప్‌లో ఎల్ఐసీ ప్రీమియం కట్టండి ఇలా

LIC | చాలా రోజుల క్రితమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎం యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడైనా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: October 22, 2019, 5:14 PM IST
LIC: పేటీఎం యాప్‌లో ఎల్ఐసీ ప్రీమియం కట్టండి ఇలా
LIC: పేటీఎం యాప్‌లో ఎల్ఐసీ ప్రీమియం కట్టండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 22, 2019, 5:14 PM IST
మీరు ఎల్ఐసీ ప్రీమియం కట్టలేదా? ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లి ప్రీమియం చెల్లించే టైమ్ లేదా? మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉంటే చాలు. ఈజీగా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. పేటీఎంలో మొబైల్ రీఛార్జ్‌లు, పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్, సినిమా టికెట్ల బుకింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు... ఇలా అనేక లావాదేవీలు జరపొచ్చు. వీటితో పాటు బీమా సంస్థల ప్రీమియంలు కూడా సులువుగా చెల్లించొచ్చు. ఇందుకోసం చాలా రోజుల క్రితమే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. పేటీఎం యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీరు ఎప్పుడైనా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ సెక్షన్‌లో ఎల్ఐసీ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఎల్ఐసీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయండి. గెట్ ప్రీమియం పైన క్లిక్ చేస్తే మీ పాలసీ వివరాలు వస్తాయి. మీ పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం డ్యూ డేట్, ఇన్‌స్టాల్‌మెంట్ నెంబర్, ప్రీమియం మొత్తం లాంటి వివరాలన్నీ సరిచూసుకోండి. ఒకవేళ ఏదైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటే ప్రోమో కోడ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లించిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఆ వివరాలను భద్రపర్చుకోవాలి.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC: ఇండియన్ రైల్వే 2019 టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే...

Credit Card: క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా? కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలివే...
Loading...
IRCTC: ఐఆర్‌సీటీసీ లాయల్టీ ప్రోగ్రామ్‌తో క్యాష్‌బ్యాక్... ఎలాగో తెలుసుకోండి
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...