Flipkart Plus: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌తో లాభాలివే... పొందండి ఇలా

Flipkart Plus | ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యత్వం తీసుకున్నవారికి అనేక లాభాలు ఉన్నాయి. అసలు ఈ మెంబర్‌షిప్ ఎలా తీసుకోవాలో, సూపర్ కాయిన్స్‌తో లాభమేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: October 20, 2020, 5:03 PM IST
Flipkart Plus: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌తో లాభాలివే... పొందండి ఇలా
Flipkart Plus: ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌తో లాభాలివే... పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అనే కొత్త లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ నుండి చేసే ప్రతి కొనుగోలుకు సూపర్ కాయిన్స్ రూపంలో రివార్డ్స్ పొందుతారు. అంతేకాక వినియోగదారుడు చేసే ప్రతి ఆర్డర్ ఉచితంగా, వేగంగా డెలివరీ చేయడం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డే వంటి ఫెస్టివల్ సేల్స్‌ ముందస్తుగానే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్డర్ ద్వారా వారు సంపాదించే కాయిన్స్‌ను రివార్డ్స్ కోసం వాడుకోవచ్చు లేదా ఇతరులకు ఎక్స్చేంజ్ చేయవచ్చు. అత్యుత్తమ కస్టమర్ సపోర్ట్ను కూడా పొందవచ్చు. కాగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులు ఖర్చు చేసే ప్రతి రూ.100కి రెండు సూపర్ కాయిన్లు లభిస్తాయి. ఈ సూపర్ కాయిన్స్ ఉపయోగించి చేసే చెల్లింపులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

LG G8X ThinQ: 12 గంటల్లో 1.75 లక్షల యూనిట్స్ సేల్... రూ.70,000 స్మార్ట్‌ఫోన్ రూ.21,990 ధరకే కొనండి ఇలా

Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను పొందడం ఎలా?


ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే వినియోగదారుడు గత 12 నెలల్లో 200 సూపర్ కాయిన్లను కొనుగోలు చేయాలి లేదా సంపాదించాల్సి ఉంటుంది. మెంబర్షిప్‌కు కావల్సిన కాయిన్స్‌ను సంపాదించిన తర్వాత, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ పేజీలోని ‘జాయిన్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

సూపర్ కాయిన్స్ సంపాదించడం ఎలా?


ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ చేసే ప్రతి రూ.100 చెల్లింపుకు 4 సూపర్ కాయిన్లు లభిస్తాయి. అదే, నాన్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ విషయానికి వస్తే వారు చేసే ప్రతి రూ.100 ఖర్చుకు 2 సూపర్ కాయిన్లు లభిస్తాయి. అయితే, ప్రతి ఆర్డర్‌కు గరిష్టంగా 100 సూపర్కాయిన్లు సంపాదించే అవకాశం మాత్రమే ఉంటుంది. అదే నాన్ ప్లస్ మెంబర్స్ అయితే ప్రతి ఆర్డర్‌కు గరిష్టంగా 50 సూపర్కాయిన్లు మాత్రమే సంపాదించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ అయి రిటర్న్ పీరియడ్ పూర్తయిన తర్వాతే సూపర్ కాయిన్స్ వినియోగదారుడి ఖాతాకు జమ అవుతాయి. జమ అయిన సూపర్ కాయిన్స్ను ఏడాదిలోపు యూజ్ చేయాల్సి ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: October 20, 2020, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading