హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Prime: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్... పొందండి ఇలా

Amazon Prime: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్... పొందండి ఇలా

Amazon Prime: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్... పొందండి ఇలా (image: Reuters)

Amazon Prime: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్... పొందండి ఇలా (image: Reuters)

Amazon Prime Membership | అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.999, నెలకు రూ.129 చెల్లించాలి. ఇటీవల 18-24 ఏళ్ల యువతకు 50 శాతం క్యాష్‌బ్యాక్(రూ.500) ఇస్తోంది అమెజాన్.

ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ప్రతీ ఏటా ప్రత్యేకంగా సేల్ నిర్వహిస్తూ ఉంటుంది. అంతేకాదు... ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నవారికి ఏడాదంతా ప్రత్యేకమైన సేవలు లభిస్తాయి. అమెజాన్‌లో ఏదైనా వస్తువు కొంటే డెలివరీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్‌కు ఉచిత డెలివరీ సౌకర్యం ఉంటుంది. ఇక ప్రైమ్ వీడియోలో సినిమాలు, ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ చూడొచ్చు. ప్రైమ్ వీడియోను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌తో పాటు ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌, స్మార్ట్ టీవీలో వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్స్‌కు ప్రైమ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా ఉచితం. ఇలా అమెజాన్ ప్రైమ్‌తో అనేక లాభాలు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.999, నెలకు రూ.129 చెల్లించాలి. ఇటీవల 18-24 ఏళ్ల యువతకు 50 శాతం క్యాష్‌బ్యాక్(రూ.500) ఇస్తోంది అమెజాన్. అంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.499 మాత్రమే.

షాపింగ్ నుంచి వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ వరకు అనేక సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందే అవకాశం వస్తే అంతకన్నా ఏం కావాలి. కొన్ని కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కొన్నా, సర్వీసుల్ని వాడుకున్నా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఇస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ తమ వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం రూ.1,099 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్ ఎంచుకోవాలి. ఇక ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితమే. ఇక రూ.499 నుంచి ప్లాన్స్ తీసుకునే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్ ఉచితం.

ఎయిర్‌టల్ లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. ఎంపిక చేసిన సర్కిళ్లల్లో కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. భారత్ ఫైబర్ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు వొడాఫోన్ కూడా రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ తీసుకున్నవారికి ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇస్తోంది. రూ.399 నుంచి ఏ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నా అమెజాన్ ప్రైమ్ ఉచితంగా పొందొచ్చు. కొద్దిరోజుల క్రితం టాటా స్కై బింజ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ పొందిన కస్టమర్లకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ లభిస్తుంది. నెలకు రూ.249 చెల్లిస్తే చాలు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC: వైజాగ్ నుంచి రాజస్తాన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

e-PAN Card: కేవలం 10 నిమిషాల లోపు ఇ-పాన్ కార్డ్ జారీ

మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

First published:

Tags: AIRTEL, Amazon, AMAZON INDIA, Amazon prime, IDEA, Tata Sky, VODAFONE

ఉత్తమ కథలు