WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...

WhatsApp Dark Mode | వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. కానీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ముందే వాట్సప్‌లో డార్క్‌ మోడ్ ఉపయోగించుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 25, 2019, 1:32 PM IST
WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...
WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 25, 2019, 1:32 PM IST
వాట్సప్‌లో డార్క్ మోడ్... ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశం. ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ మెసెంజర్, అమెజాన్ కిండిల్ లాంటి యాప్స్ అన్నీ డార్క్ మోడ్ ఫీచర్‌ను యూజర్లకు అందించాయి. కానీ... వాట్సప్ మాత్రం చాలాకాలం వరకు డార్క్ మోడ్ గురించే ఆలోచించలేదు. కొన్ని నెలల క్రితం వాట్సప్‌లో కూడా డార్క్ మోడ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో వాట్సప్ యూజర్లు డార్క్ మోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ వాట్సప్ డార్క్‌మోడ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం లేదు. అయితే వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. కానీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ముందే వాట్సప్‌లో డార్క్‌ మోడ్ ఉపయోగించుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ అప్‌డేట్ చేసుకోవాలి. ఇప్పటికే గూగుల్ పిక్సెల్ ఫోన్స్, షావోమీ ఎంఐ 9, హువావే మేట్ 20 ప్రో, ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్, ఎస్సెన్షియల్ ఫోన్, ఎల్‌జీ జీ8, నోకియా 8.1, ఒప్పో రెనో, రియల్‌మీ 3 ప్రో లాంటి ఫోన్లకు ఆండ్రాయిడ్ క్యూ అప్‌డేట్ వచ్చింది. ఆండ్రాయిడ్ క్యూ బీటా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాట్సప్ డార్క్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Display -> Select Theme ఆప్షన్‌లో Dark ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Settings -> About Phone ఓపెన్ చేయాలి. బిల్డ్ నెంబర్ డీటెయిల్స్ పైన 7 సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడు డెవలపర్ మోడ్ ఓపెన్ అవుతుంది. Developer Options ఓపెన్ చేసి 'override force-dark' క్లిక్ చేస్తే అన్ని యాప్స్‌కి డార్క్ మోడ్ అప్లై అవుతుంది. ఇలా మీరు మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు.

మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటే iOS 11, iOS 12 వర్షన్స్‌లో ఇంకా సులువుగా డార్క్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. Settings -> General -> Accessibility ఓపెన్ చేస్తే Invert Colors, Color Filters, Auto Brightness, Reduce White Point ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ క్లిక్ చేసి Smart Invert సెలెక్ట్ చేయాలి. ఐఓఎస్‌తో పాటు అన్ని యాప్స్‌ను డార్క్ మోడ్‌లోకి మార్చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఈ సెట్టింగ్స్ ద్వారా డార్క్ మోడ్ సెలెక్ట్ చేస్తే కొన్ని ఫీచర్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

Realme: రియల్‌మీ నుంచి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఫోటో తీస్తే ఇలా ఉంటుంది
Loading...
RBI: ఆ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... జూలై 1 నుంచి కొత్త రూల్స్

IRCTC Tour: తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...