వాట్సప్... పాపులర్ మెసేజింగ్ యాప్. ఇన్‌స్టంట్‌గా మెసేజెస్ పంపాలన్న ఆలోచనతో వాట్సప్ మొదలైంది. ఆ తర్వాత మెసేజెస్ మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఆడియో మెసేజెస్ ఇలా అనేక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక స్నేహితులను, కుటుంబ సభ్యులను ఒకే చోటికి కలిపే గ్రూప్స్ కూడా వచ్చేశాయి. వాట్సప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువగా వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజెస్, ఫైల్స్‌తోనే సమస్య. స్నేహితులకు ఓ గ్రూప్, కుటుంబ సభ్యులకు ఓ గ్రూప్, బంధువులకు ఓ గ్రూప్, ఉద్యోగుల కోసం ఓ గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు కనీసం 10 గ్రూప్స్‌లో ఉంటారు. ఈ గ్రూప్స్‌లో రోజూ వందలాది మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చే ఫోటోలు, వీడియోలతో స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ కావడం మామూలే. ఈ సమస్యకు పరిష్కారం చూపించింది వాట్సప్. కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరుతో ఫీచర్ అందిస్తోంది.
Poco M3: పోకో ఎం3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవే
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీరు మీ వాట్సప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఆన్ చేయొచ్చు. మీరు కావాలనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఓ ఛాట్‌లో ఆన్ చేస్తే మీరు అందులో గత వారం రోజుల మెసేజెస్ తప్ప ఇంకేమీ కనిపించవు. అంతకు ముందు వచ్చిన మెసేజెస్ అన్నీ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. మీరు పంపిన మెసేజ్‌తో పాటు, మీకు వచ్చిన మెసేజెస్ వారం రోజుల తర్వాత డిలిట్ అయిపోతాయి. అయితే ఛాట్‌లో వచ్చిన ఫోటోలు, వీడియోలు డిలిట్ కావొద్దంటే ఆటో డౌన్‌లోడ్ ఆన్ చేయాలి. అందులో వచ్చిన ఫోటో, వీడియో ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. ఛాట్‌లో ఫైల్స్ డిలిట్ అయినా ఫోన్‌లో ఉంటాయి. మరి మీ వాట్సప్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.
Dual Selfie Camera Phones: సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో ఏదైనా ఛాట్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్ పేరు మీద ట్యాప్ చేయండి. మీకు Disappearing messages కనిపిస్తుంది.
అందులో On, Off ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు On పైన క్లిక్ చేస్తే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్ అవుతుంది. ఇక ఆ ఛాట్‌లోని మెసేజెస్ వారం రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆఫ్ చేయాలంటే Off పైన క్లిక్ చేస్తే చాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Whatsapp