Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్... స్లాట్ బుక్ చేయండి ఇలా

Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్... స్లాట్ బుక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Aarogya Setu App Covid-19 vaccine registration | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ ఉందా? అయితే కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ఆరోగ్య సేతు యాప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఆరోగ్య సేతు యాప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండో దశ వ్యాక్సినేషన్ కోసం మార్చి 1న Co-WIN పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది భారత ప్రభుత్వం. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Co-WIN వెబ్ పోర్టల్‌లో ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Co-WIN ప్లాట్‌ఫామ్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో కూడా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయొచ్చు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడ్డవారంతా కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఏవైనా వ్యాధులు, జబ్బులు ఉన్నవారికి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం వ్యాధుల జాబితా రూపొందించింది. ఆ 20 రకాల వ్యాధులు ఉన్న 45 ఏళ్ల పైబడ్డవారు కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఆ వ్యాధుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Co-WIN ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేయాలంటే వెబ్‌సైట్‌ https://www.cowin.gov.in/ లో స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. అదే ఆరోగ్య సేతు యాప్‌లో చేయాలంటే స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్‌ఫోన్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సేతు యాప్‌లో సులువుగా వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుక్ చేయొచ్చు. మరి మీరు ఆరోగ్య సేతు యాప్ ఉపయోగిస్తున్నట్టైతే వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేయండి.

    COVID 19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ కోసం Co-WIN వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా

    COVID 19 Vaccine: ఈ 20 రకాల వ్యాధులు ఉన్నాయా? కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు


    Aarogya Setu App Covid-19 vaccine registration: ఆరోగ్య సేతు యాప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయండి ఇలా


    ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేయండి.
    ఆ తర్వాత CoWin సెక్షన్ పైన క్లిక్ చేయండి.
    లిస్ట్‌లో Vaccination పైన క్లిక్ చేయండి.
    అందులో Register Now పైన క్లిక్ చేయండి.
    మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
    మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది.
    ఆ తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఫోటో ఐడీ ప్రూఫ్‌లో ఏదైనా ఓ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
    ఐడీ నెంబర్, పేరు, జెండర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
    ఒకవేళ వయస్సు 45 ఏళ్ల లోపు ఉంటే సంబంధిత డాక్యుమెంట్స్ ఉన్నట్టు చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ వ్యాక్సినేషన్ సమయంలో చూపించాలి.
    ఆ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన తేదీ, సమయం లాంటి వివరాలు ఉంటాయి.

    ఒకే మొబైల్ నెంబర్‌తో నలుగురు బెన్ఫీషియరీస్‌ని యాడ్ చేయొచ్చు. ప్రభుత్వ కేంద్రాల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉచితం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. ఒక డోసుకు రూ.250 చెల్లించాలి. స్మార్ట్‌ఫోన్ లేనివాళ్లు కాల్ సెంటర్ నెంబర్ 1507 కి కాల్ చేసి నమోదు చేయించుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: