హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gmail Full: జీమెయిల్ ఫుల్ అయిందా? అవసరంలేని మెయిల్స్ ఒకేసారి స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేయండిలా

Gmail Full: జీమెయిల్ ఫుల్ అయిందా? అవసరంలేని మెయిల్స్ ఒకేసారి స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేయండిలా

Gmail Full: జీమెయిల్ ఫుల్ అయిందా? అవసరంలేని మెయిల్స్ ఒకేసారి స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Gmail Full: జీమెయిల్ ఫుల్ అయిందా? అవసరంలేని మెయిల్స్ ఒకేసారి స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Gmail Full | జీమెయిల్ ఫుల్ అయితే స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలో అన్న టెన్షన్ యూజర్లలో కనిపిస్తుంది. అవసరంలేని మెయిల్స్ ఒకేసారి స్మార్ట్‌ఫోన్‌లో డిలిట్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

జీమెయిల్ ఫుల్ కావడం ప్రతీ యూజర్ ఎదుర్కొనే సమస్యే. జీమెయిల్ ఫుల్ (Gmail Full) అయినప్పుడల్లా అవసరం లేని మెయిల్స్, ఫైల్స్ డిలిట్ చేయడానికి తిప్పలు పడుతుంటారు. గూగుల్ ప్రతీ యూజర్‌కు 15జీబీ వరకు స్టోరేజ్ ఇస్తుంది. అంటే ఒక గూగుల్ అకౌంట్ (Google Account) క్రియేట్ చేస్తే 15జీబీ స్టోరేజ్ లభిస్తుంది. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్ లాంటి గూగుల్ సర్వీస్‌లు అన్నింటికీ కలిపి 15జీబీ మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టోరేజ్ ఫుల్ అయిందంటే అవసరం లేని ఫైల్స్ డిలిట్ చేసి స్పేస్ ఖాళీ చేసుకోవచ్చు. జీమెయిల్‌లో వచ్చే ప్రమోషనల్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్ కారణంగా స్టోరేజ్ ఎక్కువగా ఫుల్ అవుతుంది.

డెస్క్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి అవసరం లేని ఫైల్స్ డిలిట్ చేయడం సులువే. కానీ స్మార్ట్‌ఫోన్‌లో అయితే ఒక్కో మెయిల్ సెలెక్ట్ చేసి డిలిట్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో కూడా బల్క్‌గా మెయిల్స్ డిలిట్ చేయొచ్చు. కేటగిరీల వారీగా లేదా రీడ్, అన్‌రీడ్ ఫిల్టర్స్‌తో మెయిల్స్ డిలిట్ చేయడం ఈజీ. డెస్క్‌టాప్‌లో ఉన్నట్టుగానే స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెస్ ఉంటుంది. ఎలాగో తెలుసుకోండి.

Jio: జియో యూజర్లకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

జీమెయిల్‌లో మెయిల్స్ డిలిట్ చేయండిలా

మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా డెస్క్‌టాప్‌లో బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేయండి.

ఇన్‌బాక్స్ సెక్షన్‌లో డౌన్ యారో క్లిక్ చేయండి.

మీరు అన్ని మెయిల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే All పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత డిలిట్ పైన క్లిక్ చేస్తే మెయిల్స్ డిలిట్ అవుతాయి.

ఆ పేజీలో ఎన్ని మెయిల్స్ ఉంటే అన్ని డిలిట్ అవుతాయి.

లేదా ఒక కేటగిరీకి సంబంధించిన మెయిల్స్ డిలిట్ చేయాలనుకుంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేయాలి.

Primary, Promotions, Social, Updates అని వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి.

వీటిలో ప్రైమరీ సెక్షన్‌లో ముఖ్యమైన మెయిల్స్ దాచుకొని మిగతావి డిలిట్ చేయొచ్చు.

మీరు ఇప్పటివరకు చదవని మెయిల్స్ డిలిట్ చేయాలనుకుంటే 'label:uread' అని టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయాలి.

Mi Clearance Sale: స్మార్ట్‌ఫోన్ క్లియరెన్స్ సేల్... ఈ 33 షావోమీ మొబైల్స్‌పై అనూహ్యమైన డిస్కౌంట్

ఇలా వేర్వేరు కేటగిరీల ఇమెయిల్స్‌ని డిలిట్ చేయొచ్చు. ఒకవేళ మీ జీమెయిల్‌లో, గూగుల్ డ్రైవ్‌లో అన్నీ ముఖ్యమైన ఫైల్స్, గూగుల్ ఫోటోస్‌లో ఇంపార్టెంట్ ఫోటోస్ ఉంటే మీరు అదనంగా స్టోరేజ్ ఉపయోగించడానికి గూగుల్ నుంచి స్టోరేజ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వన్ పేరుతో వేర్వేరు ప్లాన్స్ ఉన్నాయి. నెలకు రూ.130 ప్లాన్ తీసుకుంటే 100జీబీ స్టోరేజ్, నెలకు రూ.210 ప్లాన్ తీసుకుంటే 200జీబీ స్టోరేజ్, నెలకు రూ.650 ప్లాన్ తీసుకుంటే 2టీబీ స్టోరేజ్ లభిస్తుంది. మీ స్టోరేజ్‌ను మీరు ఐదుగురితో పంచుకోవచ్చు. గూగుల్ ఎక్స్‌పర్ట్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది.

First published:

Tags: GMAIL, Google

ఉత్తమ కథలు