స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకోగానే ఏం చేయాలో అర్థం కాదు. కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అన్న ఆలోచన వెంటాడుతుంది. అయితే ఫోన్ పోయినప్పుడు అందులోని డేటాతో మీ స్మార్ట్‌ఫోన్‌ను మిస్యూజ్ చేసే ప్రమాదముంది. ముఖ్యంగా వాట్సప్‌కి లాక్ లేకపోతే మీ వ్యక్తిగత మెసేజ్‌లను ఫోన్ దొరికినవారు యాక్సెస్ చేసే ప్రమాదముంది. అందుకే ఫోన్ పోయిన వెంటనే కంగారుపడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. మీ ఫోన్ మీ దగ్గర లేకపోయినా మీ వాట్సప్ ఛాట్స్‌ని కాపాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీ ఫోన్ పోయిన వెంటనే మొదట సిమ్ కార్డ్ లాక్ చేయాలి. మీ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి సిమ్ కార్డ్ బ్లాక్ చేయించాలి. దీని ద్వారా మీ వాట్సప్ అకౌంట్ వెరిఫై చేసే అవకాశం ఉండదు. అయితే సిమ్ కార్డు బ్లాక్ చేసినా వైఫై సాయంతో మీ వాట్సప్ యాక్సెస్ చేసే అవకాశముంది. అందుకే మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిన తర్వాత అదే నెంబర్‌తో మరో సిమ్ కార్డ్ తీసుకొని మీ వాట్సప్‌ని యాక్టివేట్ చేయాలి. ఒకవేళ కొత్త సిమ్‌తో మీ వాట్సప్ అకౌంట్ యాక్టివేట్ చేయాలని లేకపోతే support@whatsapp.com మెయిల్ ఐడీకి ఓ ఇమెయిల్ పంపాలి. 'Lost/stolen: please deactivate my account' అనే సబ్జెక్ట్‌తో మెయిల్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌ను ఇంటర్నేషనల్ ఫార్మాట్లో రాయాలి. అంటే మీ ఫోన్ నెంబర్ ముందు +91 తప్పనిసరిగా ఉండాలి. మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.
మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అయిన తర్వాత కూడా మీ వాట్సప్ నెంబర్‌కు 30 రోజుల పాటు మెసేజ్‌లు వస్తాయి. అవి పెండింగ్ స్టేటస్‌లో ఉంటాయి. ఒకవేళ మీరు మీ అకౌంట్‌ని రీయాక్టివేట్ చేస్తే మీ పెడింగ్ మెసేజ్‌లు అన్నీ వస్తాయి. మీరున్న గ్రూప్స్ కూడా పనిచేస్తాయి. ఒకవేళ మీ అకౌంట్‌ని 30 రోజుల్లో యాక్టివేట్ చేయకపోతే శాశ్వతంగా డిలిట్ అవుతుంది.
నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC Rail Connect: ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్ ఇవే
Airtel Idea New Plans: ఎయిర్టెల్, ఐడియా లేటెస్ట్ ప్లాన్స్, బెనిఫిట్స్ తెలుసుకోండి
WhatsApp: వచ్చే ఏడాది ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు... లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?Published by:Santhosh Kumar S
First published:December 13, 2019, 5:42 pm IST